1.పిల్లలులేని గొడ్రాలు బతుకు,
నిస్సారం!
తప్పుడు పిల్లలున్న గాంధారి,
శోకసాగరం!
లెక్కల తప్పులు సహజం!
తప్పు లెక్కలు మహానేరం!
నిజమరణాలు దాచడం!
మరణాలు తక్కువే అనడం!
పెద్ద సంఖ్యలో,
మరణధృవీకరణపత్రాలు!
వాళ్ళున్నట్టా! శవమైనట్టా!
2.మోసం బతికిఉన్నవాడికేనా,
చచ్చినవాడికి విస్తరిస్తున్నాం!
మానవత్వం పాతేస్తున్నాం!
దేనికో తలుపులు తెరుస్తున్నాం!
3.చెప్పేది ఒకటి!
చేసేది వేరొకటి!
వంచనతోపాటు ఆత్మవంచన!
బతుకంతా మాయ పంచన!
పొరపాటున నిజం చెప్పకు!
అందరూ అబద్ధానికి,
అలవాటయ్యారు!
4."నాయనా! పులివచ్చె!"
రానప్పుడు ,అన్నాడొకడు!
నిజంగా వచ్చి , అరిచాడు!
ఒక్కడైనా వచ్చి నిలిచాడా!
దిక్కులేని చావు చచ్చాడుగా!
5.కష్టాలకడలిలో ఉన్నా,
ఎన్నడూ "హరీ" అనలేదు!
సత్యాన్నే పలికాడు!
యుగయుగాలుగా,
మచ్చలేని చంద్రుడైనాడు!
మీరు వాడికి వారసులంటే,
అదో తప్పుడు లెక్కే!
ఓ నక్క జిత్తుల నరుల్లారా!
తులసి వనాన ,
గంజాయిమొక్కల్లారా!
కనండి కాలుడి రాత!
వినండి డప్పుల మోత!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి