ఆఖరి కోరిక :- తాటి కోల పద్మావతి గుంటూరు.

 మనిషికి కోరికలు ఉండటం సహజమే కానీ అవి తీరేవి గా ఉండాలి అయితే మనిషి దుఃఖపు అంచుల దాకా చేరక తప్పదు. సరోజనమ్మ కి చిన్నప్పటినుంచి కార్పోరేట్ హాస్పటల్ లో మంచి వైద్యం అంటే ఖరీదైనది చేయించుకోవాలని కోరికగా ఉండేది.
చిన్నప్పుడు జ్వరం కడుపు నొప్పి ఇలాంటివి వచ్చినప్పుడు ఏ ఆయుర్వేద గుళికలు కానీ హోమియోపతి మందులు కానీ తెచ్చి వేసేవాళ్ళు అలాగే ఆమె జీవితం గడిచిపోతూ వచ్చింది పెళ్లి అయినాక పురిటి కోసం తీసుకొచ్చారు అప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రి లోనే పురుడు పోశారు అత్తవారింట్లో కూడా అంతగా ఆర్థిక స్తోమత లేదు సరోజనమ్మ కి కార్పొరేట్ హాస్పటల్లో ఎప్పటికైనా నా వైద్యం చేయించుకోవాలని ఆశగా ఉండేది.
తన పిల్లలకి కూడా అంతంత మాత్రం గానే వైద్యం చేయించే వాళ్ళు.
సరోజనమ్మ కి ముగ్గురు ఆడపిల్లలే పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోయాడు అప్పటి నుంచి కూతురు దగ్గరే కాలం గడుపుతున్నది.
ఒకసారి సరోజనమ్మ కి జ్వరం వచ్చింది కూతురు అల్లుడు ఊరిలో లేదు మనవడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని చూశాడు ససేమిరా అక్కడ చేరనుంది.
అల్లుడు వెంటనే వచ్చి ఆమెను కార్పొరేటు హాస్పిటల్లో చేర్పించాడు జ్వరమే కదా నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది అనుకొన్నారు కూతురు కూడా దగ్గరుండి సేవలు చేస్తున్నది ఇలాగైనా అమ్మ కోరిక తీర్చాలని అనుకున్నారు.
అనుకున్నది ఒకటైతే మరో విధంగా గా ఆమెకి జ్వరం తగ్గలేదు డాక్టర్లు ఐసీయూలో నుంచి రకరకాల టెస్టులు చేయించారు ప్రతిరోజు టెస్టుల పేరుతో మందులు ఖర్చు పెరిగిపోతున్నది ఎన్ఆర్ఐ స్కానింగ్ రిపోర్టులు అన్ని లక్షల్లో చూపించారు కానీ జ్వరం మాత్రం తగ్గలేదు చివరికి తలలో రక్తం గడ్డ కట్టింది అని తేల్చి చెప్పారు ఈ విషయం విన్నాక సరోజనమ్మ మా కూతురు అల్లుడు చాలా బాధ పడ్డారు అంత డబ్బు ఖర్చు చేసినా నయం కాలేదు ఇప్పుడు ఎలా చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది కూతురి మెడలో నగలు తాకట్టు పెట్టాలని ఉంది పది రోజులు గడిచాయి 10 లక్షలు ఖర్చు అయినాయి వైద్యం అందిస్తూనే ఉన్నారు.
తల్లి కోరిక తీర్చాలని ఎంత తాపత్రయపడి నా ఉన్న డబ్బంతా అయిపోయింది ఇప్పుడెలా ఏం చేయాలి ఆమె కోరిక తీర్చినట్లు ఉంటుందని ఆశపడ్డారు కానీ ఫలితం సున్నా.
చివరికి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మా అమ్మకి ఇలాగైనా నా వైద్యం చేయించి బ్రతికించు కోవాలని కూతురి ఆశ డాక్టర్లు మాత్రం రోజు రోజుకి పరీక్షలు చేస్తూనే ఉన్నారు మందులు వాడుతూనే ఉన్నారు అయినా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు ‌
ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు అప్పు చేసిన తీర్చే స్థితిలో లేరు ఉన్న డబ్బంతా వైద్యానికి ఖర్చు అయింది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు మరో రెండు రోజులు చూడాలని ఆశ పడ్డారు చివరికి డాక్టర్లు ఈమె బ్రతకటం కష్టం అని తేల్చి చెప్పారు అప్పుడు బాధపడి ఏం ప్రయోజనం డబ్బుకి డబ్బు పోయింది మనిషి బ్రతికే స్థితిలో లేదు మర్నాడే రెండు లక్షలు కట్టి ఇంటికి తీసుకు వెళ్ళమన్నాడు.
అప్పటికే బంగారం తాకట్టు లోకి వెళ్ళిపోయింది అప్పుడు కూడా చేశారు ఇంకా చేయి దాటి పోయింది చేతిలో చిల్లిగవ్వ లేదు డాక్టర్లు ఇంటికి తీసుకుని వెళ్ళ వచ్చు అన్నారు అంబులెన్స్లో సరోజ నమ్మను ఇంటికి తీసుకు వచ్చారు ఆ మరునాడే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
చివరి దశలో ఆమెకి కర్మకాండల కి కూడా డబ్బు లేదు బంధువులంతా ఎవరికి తోచిన సాయం వాళ్లు చేయవలసి వచ్చింది.
ముందు ముందు జాగ్రత్త పడి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఉంటే ఆ డబ్బుతో దినవారాలు సవ్యంగా జరిపించే వాళ్ళు.
పరిస్థితులు తారుమారు అయ్యాయి బంధువులంతా తల చెయ్యి వేసి ఇ ఆమెని సాగనంపారు డబ్బులు ఉంటేనే కార్పొరేట్ హాస్పిటల్లో ఖరీదైన వైద్యం చేయించుకోవాలి.
సరోజనమ్మ కోరిక పరాకాష్టకు చేరుకునే కుటుంబాన్ని అప్పుల పాలు చేసింది అప్పులు తీర్చడానికి వాళ్ళు ఎంత కాలం బాధపడాలో బోధపడలేదు ‌
మనిషి తన కోరికను ఆకాశానికి అందేటట్లు పెంచుకోకూడదు ఉన్నదాంట్లోనే సంతృప్తి చెందటం నేర్చుకుంటేనే జీవితం సాఫీగా సాగిపోతుంది.