డాక్టర్స్ డే శుభాకాంక్షలు:-లయన్ కృపాకర రెడ్డి--Cell: 9441162369
ఆపదలో , అత్యవసర వేళ
మీకు అండగా మేమున్నామంటూ
ముందుకు వచ్చే వైద్యులారా
మీకు శతకోటి వందనాలు

ప్రజల ప్రాణాలు నిలుపుటకై
నిరంతరం మీరు చేసే
ప్రయత్నం అలుపెరుగనిది ...

మానవత్వంతో మమత అనే
ప్రాణవాయువును అందించే
మీ సేవ అజరామరం ...

కరోనా కలకలం
ప్రపంచాన్ని చేసింది కకావికలం
అయినా వీడలేదు
మీ దృఢసంకల్పం ...

సైనికులై పూరించిన
మీ సమర శంఖం
వైరసుతో మీరు చేసిన పోరాటం
ఎన్నో బ్రతుకులను నిలిపింది


నాడిని పట్టి
రోగాన్ని గాడిన పెట్టి
ఆగిపోతున్న ఊపిరులను
నిలబెట్టే ప్రత్యక్ష దైవాలు మీరు

మీరు లేని జీవితం
ఊహకందని లోకం
అందుకే .. అందుకో  
 "వైద్యో నారాయణ హరి"
శుభాశీస్సులు ...