జీవన ప్రమాణ కాలం ఒక అపోహ !?:-ప్రతాప్ కౌటిళ్యా ((కె ప్రతాప్ రెడ్డి))MSc Bio-chem Mtech Bio-Tech

 ఒక శుక్రకణం ఒక అండం ద్వారానే కణం కణజాలం పిండం ఏర్పడినప్పుడు దాని జీవిత కాల ప్రమాణం నిర్ధారించ బడి ఉంటుంది. ప్రతి జీవి జీవిత ప్రమాణ కాలం అంటే ఆ కణం ఆ కణజాలం ఆ అవయవం కూడా దాని జీవితకాల ప్రమాణం అని అర్థం.

ఒక జీవి జీవన ప్రమాణ కాలం కేవలం దాని శరీరం లోని అవయవాల కు వేరు వేరుగా ఉండదు అంటే శరీరంలోని ప్రతిక్షణం ప్రతి కణజాలముఆ జీవిత ప్రమాణాలాన్నీ సమానంగానే కలిగి ఉంటాయి.
ఉదాహరణకు మెదడు దాని జీవన ప్రమాణ కాలం నూట నలభై ఐదు ఏళ్ళు అనుకుంటే అంతవరకు అది జీవించి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలోని అన్ని అవయవాలు కూడా అంటే గుండె మూత్రపిండాలు మొదలైనవి కూడా నూట నలభై ఐదు ఏళ్ళు జీవించే జీవన ప్రమాణ కాలాన్ని కలిగి ఉంటాయని అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే పిండం నుంచి ఏర్పడ్డ కణం కణజాలం అంతా కూడా ఒకే రకమైన డీఎన్ఏను కలిగి జన్యు నిర్మాణం జీన్ ఎక్స్ప్రెషన్ యంత్రాంగాన్ని కలిగి ఉండాల్సిందే అంతేకానీ శరీరంలోని వివిధ అవయవాలు విడివిడిగా రకరకాల జీవన ప్రమాణిక కాలమును కలిగి ఉండవు. పిండంలోని ప్రతికణం ప్రతి కణజాలము ప్రతి అవయవము కూడా ఆ జీవి జీవన ప్రామాణిక కాలాన్ని సమానంగా కలిగి ఉంటాయని గుర్తించాలి.
కొన్ని పరిస్థితులలో ఒకరి అవయవాన్ని మరొకరికి అవయవ దానం చేసినప్పుడు కూడా ఆ అవయవ జీవన కాల ప్రమాణం అన్నది కూడా మారదు అంటే ఎవరి నుంచి అవయవ దానం పొందుతున్నామో ఆ దాత జీవన ప్రమాణ కాలం ఎంత ఉంటుందో అంతే ప్రామాణిక కాలంతోనే ఆ అవయవం పని చేస్తుంది తప్ప స్వీకర్త జీవన ప్రామాణిక కాలం ను అది పొంది ఉండదు. అలాగే స్వీకర్త మిగతా అవయవాల ప్రామాణిక జీవన కాలాన్ని అది కలిగి ఉండదని అర్థం చేసుకోవాలి. ఇది ఇది ప్రతి జీవికి వర్తిస్తుంది.
ఒకవేళ అ ఆరోగ్యవంతమైన శరీరంలో అన్ని అవయవాలు వాటి జీవన కాల ప్రామాణికంలోనే సరిగ్గానే పనిచేస్తూ జీవిస్తాయి కానీ ఒక్కో అవయవం ఒక్కో జీవన ప్రామాణిక కాలాన్ని కలిగి ఉండవని గుర్తించాలి. అంటే మెదడు నూట నలభై ఐదు ఏళ్ళు జీవించి ఉంటే గుండె మూత్రపిండాలు కూడా వందేళ్లు పనిచేస్తాయి అన్నది ఇది ఒక అపోహ మాత్రమే. అవి కూడా నూట నలభై ఐదు ఏళ్ళు జీవించి ఉండి పనిచేస్తాయి అన్నమాట.!?
Dedicated to Mamillapally .Padma
Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273