ముల్లంగి -ఔషధ గుణాలు - 1: పి . కమలాకర్ రావు

 ముల్లంగి  ఎన్నో  విలువైన ఔషధ గుణాలున్న కూరగాయ. ఇది చాలా ఘాటైన వాసన కలిగి ఉంటుంది.
జీర్ణశక్తిని పెంచుతుంది. క్రిమి సంహారిణి. శరీరంలో వాపులను రానివ్వదు. ఇది ఆకలిని పెంచుతుంది. మూత్రకోశ  వ్యాధులను తగ్గిస్తుంది. పొత్తికడుపులో నొప్పిని పోగొడుతుంది.. ఇది కఫ వ్యాధులను మరియు పిత్తవ్యాధులను తగ్గిస్తుంది.
కొంతమంది దీని ఘాటు కారం వల్ల తినడానికి ఇష్టపడరు. కానీ దీన్ని తరచు అన్నికూరగాయలతో పాటుగా వాడి మన ఆరోగ్యాన్ని కాపాడు కోవాలి.
ఇది కాలేయాన్ని  కాపాడే దివ్యమైన  ఔషధం.
ముల్లంగి రసం
తయారీ విధానం.
ముల్లంగిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ లో వేసి ముద్దగా చేయాలి. తగినన్ని నీటిని ఒక గిన్నెలో పోసి ముల్లంగి ముద్దను అందులో వేసి బాగా మరిగించాలి. అందులో కొద్దిగా పసుపు, జిలకర, కొద్దిగా ఉప్పు వేసి, దించి  గోరు వెచ్చగా వున్నప్పుడు  త్రాగాలి. ఇది కాలేయాన్ని కాపాడుతుంది. కాలేయంలోని Bilrubin  levels ను ఎక్కవకాకుండా  చూస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలిని కూడా పెంచుతుంది.
కామెంట్‌లు