"కోవిడ్ 19భద్రత "(మినీ కథ-1):--విస్లావత్ సావిత్రి--తరగతి :10వZphs నేరళ్లపల్లి-మండలం : బాలానగర్--జిల్లా :మహబూబ్ నగర్7013264464.

  అనగనగా హిరణ్యపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో శ్రీలత, వీరయ్య దంపతులు ఉండే వారు. వీళ్లిద్దరూ కూలీ పని చేసే వాళ్ళు. వీళ్ళకు ముద్దుల కొడుకు ఉన్నాడు. అతని పేరు హేమంత్. హేమంత్ సిటీలో మంచి  ఉద్యోగం చేస్తున్నాడు.
చాలా రోజులకు తల్లిదండ్రులను చూడడానికి ఇంటికి వస్తాడు. హేమంత్ శరీరం అలసటగా ఉంటుంది. అతడు ఇంటికి చేరి పడుకుంటాడు.అప్పుడు హేమంత్ వాళ్ళ అమ్మ వచ్చి ఏమైoది  హేమంత్. ఇంట్లో వచ్చి పడుకున్నావ్. అలసిపోయావా..?. సరే పండుకో..! అని చెప్పి వెళ్ళి పోయిoది. తన తల్లి  కొన్ని గంటల తరువాత లేచి  అమ్మ నాకు దగ్గు, జ్వరం వస్తుంది. కొంచెం దూరంగా వుండండి.ముందే కరోన టైమ్. అప్పుడు తన తల్లికి మాస్క్  శ్యానిటైజర్ ఇస్తాడు. అమ్మ చేతకీ గ్లావ్స్ వేసుకొని ఈ  మాస్కూ
 తీసుకో..నా దగ్గర వేరే మాస్క్లు ఉన్నాయి. అందరు మాస్క్ ధరించండి . నా వస్త్రాలను ఎవ్వరు ముట్టుకోకండి.
15రోజులు ఈ రూమ్ లొనే ఉం టాను.
హేమంత్ కు డాక్టర్ ఇచ్చిన మందులతో కరోన తగ్గుతుంది. తరువాత అందరు చెకప్ చేయించుకుంటారు. అందరికి నెగిటివ్ వచ్చింది.తరువాత హేమంత్ తల్లి తండ్రులకు కరోనా గురించి అందరికి చెప్పమని  చెబుతాడు.
1)అందరూ భౌతిక దూరం పాటించాలి.
2)అందరూ మాస్క్ తప్పని సరిగా ధరించాలి.
3)అందరి దగ్గర స్యానిటైజర్ ఉండాలి.
4)సబ్బుతో చేతులు  కడుక్కోవాలి.
5)పరిసరాలు శుభ్రంగా  ఉంచుకోవాలి.
6)అందరు  శుభ్రంగా ఉండాలి.
7)వేడి ఆహారం తీసుకోవాలి.
8)వేడి చేసి చల్లారిన నీళ్లను తాగాలి.
హేమంత్  చెప్పిన మాటలను అందరు పాటిస్తారు.
తరువాత ఊరి పెద్ద ఊరివాళ్లందరికీ  స్యానిటైజర్ మాస్క్, పంచుతారు.
నీతి :
"మనం కూడా కరోన పరిస్థులలో హేమంత్ చెప్పిన వన్నీ మనం  కూడా పాటించాలి. ఎవరు కూడా గుంపులుగా కూర్చోకూడదు. కరోన పరిస్తులో ఇంట్లోనే ఉండాలి.
 పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం కూడా శుభ్రంగా ఉండాలి."
కామెంట్‌లు