అష్ట దిక్పాలకులు:--అ గ్ని దే వు డు (2)శంకర ప్రియ., శీ ల.,సంచార వాణి: 99127 67098

 👌 హవ్య వాహను డగ్ని
      నీటి బిడ్డడు వహ్ని
    
      ఆగ్నేయ దిశకు పతి
             ఓ తెలుగు బాల!   
   
               * * * * *
👌"హవిస్సు" (అనగా దేవతలకు సమర్పించు ఆజ్యము .. మున్నగు ద్రవ్యము) లను.. అగ్ని యందు వేల్వ బడునది.  
        హవిస్సును వహించు వాడు. కనుక, అగ్ని దేవునకు "వహ్ని" అని పేరు.
       హవ్యమును దేవతలకు చేర్చు వాడు. కనుక "హవ్య వాహనుడు" అని పేరు.
                  * * * * *
                ( అగ్ని దేవుడు... ఆగ్నేయ మూలకు అధిపతి.
 జలము నందు పుట్టిన వాడు. వాయు దేవునకు సఖుడు. కనుక, "నీటి బిడ్డడు, గాలి నెచ్చెలి" అని, అచ్చ తెలుగు పదములు. )