అష్ట మూర్తులు::-జ ల రూ పు డు - భ వు డు (2)"శంకర ప్రియ.," శీ ల.,సంచార వాణి:. 99127 67098

 👌 జలము రూపుడు శివుడు
      ఇల సర్వతో ముఖుడు
      లింగో ద్భవుడు భవుడు
             ఓ తెలుగు బాల!
   
👌పరమేశ్వరుడు.. పంచ మహా భూతము లలో.. రెండవదైన "జలము" రూపంలో విరాజిల్లు చున్నాడు. "భ వ" నామముతో వ్యవహరింపబడు చున్నాడు.
👌 సాంబ శివుడు.. అన్ని దిక్కుల వైపు ముఖములు కలవాడు. అంతటా వ్యాపించి, జీవుల రూపంలో నున్నాడు. కనుక, సర్వతో ముఖుడు.. శివుడు.
👌 భవు డనగా.. సంసార స్వరూపుడు. ఎల్లప్పుడూ నుండు వాడు. ఈ ప్రపంచ సృష్టికి, మరియు లయమునకు కారణ మైన వాడు. కనుక, "భవుడు"... అష్ట మూర్తులలో రెండవ వాడు.
           * * * * *
          ( శ్రీ ఉమా మహేశ్వరుడే... అష్ట మూర్తి యైన జగ దీశ్వరుడు. అందు వలన, ఆగమ వేత్తలైన అర్చక స్వాము లందరు; "నిత్యార్చనా విధి" లో శ్రీ మహా శివ లింగ మూర్తి యైన స్వామి వారిని.. "ఓం భవాయ, జల మూర్తయే నమః"! అని, పత్రము, పుష్పము లతో పూజించు చున్నారు! )