"కూతురి విలువ"(మినీకథ-3):-నేనావత్ మౌనిక:-10 వ తరగతి, ZPHS నేరెళ్లపల్లిమండల్ బాలానగర్జిల్లా మహబూబ్ నగర్తెలంగాణ రాష్ట్రం7013264464

 అనగనగా ఒక ఊర్లో రాఘవ అనే అబ్బాయి ఉండేవాడు.  అతను కూలిపని చేస్తూ ఉండేవాడు.  తన తల్లిదండ్రులు తనకు పెళ్లి వయసు రాగానే,  మంచి లక్షణాలు ఉన్న ఒక అమ్మాయిని చూసి, పెళ్లి చేస్తారు.  ఆమె పేరు జ్యోతి.  పెళ్లి చేసిన కొన్ని రోజుల తర్వాత, రాఘవ తల్లిదండ్రులు చనిపోతారు.  కొనఊపిరితో నువ్వు మన వంశాన్ని నిలబెట్టే, ఒక  కొడుకునే కనాలి రాఘవ.  అని చెప్పి చనిపోతారు.  ఒక సంవత్సరం తిరిగే సరికి, గర్భవతి అవుతుంది జ్యోతి.  నెలలు నిండిన తర్వాత, నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకు వస్తాడు రాఘవ.  ఆడపిల్ల పుడితే నేనే చంపేస్తాను అని రాఘవ తమ ఊరి ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్ రాఘవ తో ఇలా అంటాడు. 
    "ఇంటికి దీపం ఇల్లాలు".              "ఒక్క ఆడపిల్ల చదువుకుంటే ఆ ఇల్లు మొత్తం బాగుంటుంది". 
మీరు ఎందుకు ఆడపిల్ల పుడితే వద్దు అంటున్నారు.  అని అడుగుతాడు డాక్టర్.  డాక్టర్ చెప్పిన మాటలు వినకుండా, రాఘవ డాక్టర్  నీ పంపించు చేస్తాడు. 
తరువాత జ్యోతికి ఆడపిల్ల పుడుతుంది.  ఆ విషయం డాక్టర్ జ్యోతి కి చెప్తాడు.  జ్యోతి బాధపడుతుంది.  నాకు ఆడపిల్ల పుట్టిందని మా ఆయనకు తెలిస్తే, ఈ బిడ్డను మా ఆయన చంపేస్తాడు, అని బాధపడుతుంది. అప్పుడు డాక్టర్ నువ్వేం బాధపడకు, నీ బిడ్డను నేను పెంచుకుంటాను  అని చెప్తాడు.  జ్యోతి సంతోషించి దండం పెట్టి, ధన్యవాదాలు చెప్తుంది. 
     డాక్టర్ బయటికి వచ్చి రాఘవ తో, మీకు అమ్మాయి పుట్టి, చనిపోయింది అని చెప్తాడు. ఎలాగోలా పోయిందని సంతోషిస్తాడు రాఘవ.  డాక్టర్ జ్యోతి కూతురుకు అక్షయ అని పేరు పెట్టుకొని పెంచుకుంటాడు.
    మళ్లీ సంవత్సరం తిరిగే సరికి, జ్యోతి గర్భవతి అవుతుంది.  నొప్పులు రావడంతో హాస్పిటల్ కి తీసుకువస్తాడు రాఘవ. జ్యోతి కి కొడుకు పుడతాడు.  జ్యోతి, రాఘవ సంతోషంగా ఇంటికి వెళ్తారు.  తనకు రమేష్ అని పేరు పెడతారు.  బాగా చదివిస్తారు.   రమేష్ తన తల్లిదండ్రుల మాట వినే వాడు కాదు. తల్లికి ఏ పనిలో అసలు, సహాయం చేసేవాడు కాదు. రమేష్ పెద్ద వాడు అవుతాడు.  తనకు చిన్న జాబ్ వస్తుంది.  పెళ్లి వయసు  వస్తుంది. 
రమేష్ కు తన తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు.   రమేష్  భార్య తనకు  మాయమాటలు  చెప్పి, ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకో అని చెబుతుంది.  రమేష్ తన భార్య మాటలు విని, ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకొని, తల్లిదండ్రులను బయటకు గెంటేస్తాడు. 
   కొడుకు గెంటేశాడు, అని బాధపడుతూ,  రాఘవా, జ్యోతి రోడ్డుమీద వెళుతుండగా, జ్యోతి కళ్ళుతిరిగి  పడిపోతుంది. పక్కనే ఉన్న హాస్పిటల్ కి తీసుకువస్తాడు రాఘవ.  అక్కడ ఒక అమ్మాయి జ్యోతి కి వైద్యం చేస్తుంది.  కాసేపటి తర్వాత రాఘవ జ్యోతి బయటకు వెళ్తుండగా, జ్యోతికి మొదటిసారి సర్జరీ చేసిన, డాక్టర్ కనిపిస్తారు.  జ్యోతి డాక్టర్ దగ్గరికి వెళ్లి, నీ కూతురు ఎలా ఉంది అని అడుగుతుంది.  అలా అడుగుతుంటే రాఘవ అక్కడికి వస్తాడు.   నా కూతురు ఏంటమ్మా,  నీ కూతురు నువ్వు తొమ్మిది నెలలు మోసి, కన్న కూతురు.  ఇప్పుడు నీకు వైద్యం చేసిన అమ్మాయి, నీ కూతురు అక్షయ.  ఈ ఆసుపత్రిలో ఇప్పుడు అక్షయనే పెద్ద డాక్టర్.  అక్కడ రాఘవ జరిగిన విషయం తెలుసు కుంటాడు.  అలాగే  రాఘవ వాళ్ళ కొడుకు  రమేష్, వాళ్ళని బయటకు గెంటేసాడు అని, తెలుసుకుంటాడు డాక్టర్.  అప్పుడు డాక్టర్ రాఘవ తో ఇలా అంటాడు.  నేను చెప్పినప్పుడు, మీరు నా మాటలు వినలేదు.  ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. రాఘవ బాధపడుతూ అవునండి.  మీరు చెప్పినప్పుడు మీ మాటలు నేను విని అర్థం చేసుకొని, ఉంటే నా కూతురు మమ్మల్ని బాగా చూసుకునేది.  అని బాధపడుతూ ఉంటాడు. మా కూతురిని మీరు పెంచుకుని, బాగా  చదివించు కున్నారు.  అందుకు ధన్యవాదాలు.  అని చెప్పు వెళ్తుండగా, అక్షయ తన కన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, ఆగండి. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.  ఇక నుంచి నాతోనే ఉంటారు.  అని చెప్తుంది.
    అది విని అక్షయ తల్లిదండ్రులు, నేను నిన్ను వద్దు అనుకున్నాను నువ్వు మమ్మల్ని కావాలి.  అనుకుంటున్నా వ్. అని గుండెలకు హత్తుకుని బాధపడుతుంటారు. మీరు మీ తప్పు తెలుసుకున్నారు.  కాబట్టి నేను మిమ్మల్ని,  క్షమించాను,  అని చెప్తుంది అక్షయ. 
"కొడుకు కావాలి అని అనుకోవడం మంచిదే కానీ కూతురు వద్దు అనుకోవడం చాలా తప్పు"అని అక్షయ చెప్తుంది.  తప్పు తెలుసుకున్న అక్షయ తల్లిదండ్రులు అక్షయ తో, జీవితం ఎంతో సంతోషంగా సాగిస్తారు.       
నీతి:-
తల్లితండ్రులు  కూతురిని వద్దు అనుకున్న,   కూతురు తల్లిదండ్రులను  కావాలి, అనుకుంటుంది.  వాళ్ల ప్రేమను పొందాలని అనుకొంటుంది. కాబట్టి " దయచేసి ఇప్పటికైనా తల్లితండ్రులు కూతురు విలువ తెలుసుకోండి".......

కామెంట్‌లు