ముల్లంగి -ఔషధ గుణాలు -3:- పి . కమలాకర్ రావు

  కొందరికి  ఒంటిపై తెల్ల మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు. వీరికి ఒంటిపై సూర్యకిరణాలు పడితే ఓ ర్చు కోవడం కష్టం. అలాంటి వారికి
 ముల్లంగి గింజల పొడిలో  అల్లం
రసం కలిపిన మిశ్రమాన్ని తెల్ల
మచ్చలపై లేపనంగా పూయాలి.
వరుసగా తగ్గేవరకు దీన్ని వాడితే 
తెల్లమచ్చలు పోయి చర్మం మామూలుగా అయిపోతుంది.
  
    గొంతులో గర గరగా ఉంటే  గోరు
వెచ్చని నీటిలో ముల్లంగి గింజల పొడి వేసి కలిపి గొంతులో పోసుకొని పుక్కిలిస్తే గొంతు మామూలు స్థితికి వస్తుంది.
పొత్తికడుపులో నొప్పి తగ్గడానికి
ముల్లంగి ముక్కల రసం తీసి అందులో కొద్దిగా ఉప్పు  మిరియాలపొడి వేసి త్రాగాలి. నొప్పి తగ్గిపోతుంది.
అరిశ మొలల సమస్య వున్నవారు
తరచు ముల్లంగిని దీని ఆకులను ఆహారంలో వాడితే మొలల వ్యాధి
తగ్గి పోతుంది.
మూత్ర పిండాలలో రాళ్ళ సమస్య
వున్నవారు వరుసగా ముల్లంగిని   దీని ఆకులను ఆహారంలో  వాడితే
రాళ్లు కరిగి పోతాయి.
ముల్లంగి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. Curry గా  తినవచ్చు,
సాంబర్ లో వేసుకోవచ్చు.
అయితే  ముల్లంగిని రాత్రి పూట
తినకూడదు.
కామెంట్‌లు