అష్ట మూర్తులు:: వా యు రూ పు డు - ఉ గ్రు డు (4)"శంకర ప్రియ.," శీ ల.,సంచార వాణి:. 99127 67098

 👌వాయు రూపుడు శివుడు
      ఉమా పతి, సదా గతి
      ఉగ్ర తేజుడు, ఉగ్రుడు
             ఓ తెలుగు బాల!
   
👌పరమేశ్వరుడు.. పంచ మహా భూతము లలో.. నాలుగవ దైన "వా యు వు" రూపంలో విరాజిల్లు చున్నాడు. "ఉ గ్ర" నామముతో వ్యవహరింప బడు చున్నాడు.
👌 సాంబ శివుడు.. బ్రహ్మ విద్యకు అధిపతి. మాయా శక్తికి ప్రభువు.మూర్తీ భవించిన బ్రహ్మ విద్యా ప్రదాయిని యగు పార్వతీ దేవికి భర్త.. పరమేశ్వరుడు. కనుక, ఉమా పతి. బ్రహ్మాదులను రంజింప జేయు ప్రకాశము ( సహింప రాని తేజస్సు ) కలవాడు. కనుక, ఉగ్ర తేజుడు. పరం జ్యోతి స్వరూపుడు...శివుడు.
👌 "ఉ గ్రు" డనగా.. శత్రువుల యందు క్రోధ స్వభావం ప్రదర్శించు వాడు. వారికి భయము కలిగించు వాడు. పరిపూర్ణమైన పరం బ్రహ్మ స్వరూపుడు. కనుక, "ఉ గ్రు డు"... అష్ట మూర్తు లలో నాలుగవ వాడు.
           * * * * *
        ( శ్రీ ఉమా మహేశ్వరు డే... అష్ట మూర్తి యైన జగ దీశ్వరుడు. అందు వలన, ఆగమ వేత్తలైన అర్చక స్వాము లందరు; "నిత్యార్చనా విధి" లో శ్రీ మహా శివ లింగ మూర్తి యైన స్వామి వారిని.. "ఓం ఉగ్రాయ, వాయు మూర్తయే నమః"! అని, పత్రములు, పుష్పము లతో పూజించు చున్నారు! )