*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౪౩ - 43)

 మత్తేభము:
*భవదుఃఖంబులు రాజకీటములనే | బ్రార్ధించినన్ బాయునే?*
*భవదంఘ్రిస్తుతిచేత గాక, విలస | ద్బాలాక్షుధాక్లేశ దు*
*ష్ట విధుల్మానునె చూడ మేక మెడచం | టం తల్లి కారుణ్య దృ*
*ష్టి విశేషంబుల నిచ్చు చంటివలె | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
చిన్నపిల్లలకు ఆకలి వల్ల కలిగే బాధ, ఆ పసివాళ్ళ తల్లి తన చనుపాలు ఇస్తే తీరుతుంది కానీ,మేకల మెవైపు చూస్తూ వుంటే ఆకలి తీరదు కదా, సుదరేశ్వరా!  అలాగే మా మనుషలకు పుట్టుక మరణాల వల్ల కలిగే బాధలు, నీ పాదలను సేవించే తీరయతాయి కానీ, రాజు లను ఆశ్రయిస్తే తీరుతాయా......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఓ కాలకూట ధరా! మా మనుజులకు కలిగే జరామరణ దుఃఖాలు, నీ చరణ సేవలో తరలించడం వలన తొలగుతాయి కానీ, తోటి మానవులైన రాజులవల్ల తీరవు కదా.  నీవు సుదరేశ్వడిగా, అమ్మ అన్నపూర్ణ గా నీకు అన్నం పెడితే నీ అకలి తీరింది. ఆ అన్నపూర్ణ కు మారు రూపంగా ఇలలో అమ్మలను పంపి పిల్లల ఆకలి తీర్చావు కదా, చిదంబరా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss