తాతయ్య కథలు-56... ఎన్నవెళ్లి రాజమౌళి

 తాతయ్య! ఈ నిమ్మకాయ ఎక్కడిదో తెలుసా... అని మనవడు అనేసరికి-
చెప్పనిది నాకు ఎట్లా తెలుస్తుంది రా అన్నాడు తాతయ్య. మన పెరటి లో చెట్టుకు కాసింది. నేను చిన్నప్పుడు పెడితే.. ఇప్పుడు కాత కాస్తుంది.
శభాష్! నీ నిమ్మకాయ తోనే... నేను  ఈరోజు నీళ్లు తాగుతా...
ఎందుకు తాతయ్య అలా ప్రతిరోజు నిమ్మకాయ నీళ్లు తాగుతావు. అన్న మనవడితో-ఉదయాన్నే పరిగడుపున నిమ్మకాయ కోసి సగం వక్క ను పిండి చెంబెడు వేడి నీళ్లలో కలపాలి. ఆ నీళ్లలో చెంచా తేనే కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది.
అలాగా అయితే నేను కూడా రేపటి నుండి నీలాగే తాగుతా.
మంచిదేగా అన్న తాతయ్య-మన పెరటిలోని నిమ్మకాయల తో చట్నీ కూడా నానమ్మను పెట్టు మందాం. అలాగే తాతయ్య అన్నాడు మనవడు.