*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౫౬ - 56)

 మత్తేభము:
*కలధౌత్రాదియు, నస్థిమాలికయు, గో | గంధర్వమున్బున్కయుం*
*బులితోలున్భసితంబు, బాపతొడవు | ల్పోకుండ, దోబుట్లకై*
*తొలినేవారల తోడ బుట్టవు గళా | దుల్గల్గే మేలయ్యెనా*
*శలవుల్దూరము చేసి కొంటరిగియే | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
మంచుకొండ, ఎముకలగొలుసు, ఎద్దుబండి, పులిచర్మము, బూడిద, పాముల ఆభరణాలు, ఇంకొకరితో పంచుకోవలసిన అవసరము లేకుండా, ఒంటరిగానే పుట్టావుగదా, సాంబ!  ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న కళలు అన్నీ, నిన్నే చేరుకుని, నిన్ను కలసి ఆనందాన్ని పొందాయి.......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*గరళ కంఠా! నీవే ఆది పురుషుడివి అయినప్పుడు, నీ వెంతో ఇష్టపడే హిమశైల శిఖరాన్ని, వృషభ వాహనాన్ని, పన్నగ భూషణాన్ని, కపాలమాలను వేరెవ్వరితో పంచుకోవాలి స్వామీ.  ఇక్కడకు వచ్చేది ఒక్కరే, వెళ్ళేది ఒక్కరిగానే అని ఎంత చక్కగా చెప్పావయ్యా.  ఏబంధాలూ నిలువవు అని, నీవు ఏకాకిగా వుండి, శ్మశాన విహారివై నిరూపించావుగా, పన్నగేశా! నేను ఎవరో తెలుసుకోగలిగినప్పుడు, అన్నీ నన్నే వెతుక్కుంటూ వస్తాయి అని, ఏకాకివైన నిన్ను కళలన్నీ కలిసినప్పుడు అర్థం అయ్యింది, మహాదేవా.  నీ తత్వాన్ని ఇంత విపులంగా నీవే చెప్పినా అర్థం చేసుకోలేని మాయలో నీవే పడవేస్తే ఎలా, భుజంగ భూషణా!నీవు అన్ని కళలతో కలిసి చల్లగా వున్నట్టే, నీ చల్లని కరుణా దృష్టి, వృష్టి గా మా మీద కురిపించి మమ్మల్ని ఏలుకో, ఏడేడు లోకాల అధిపతీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss