*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౫౮ - 58)

 మత్తేభము:
*గతి నీవంచు భజించువార లప | వర్గం బొదంగానేల సం*
*తతముం గూటికినై చరింప వినలే | దా! యాయురన్నంప్రయ*
*చ్ఛతియంచున్మొరపెట్టగా శత్రులు సం | సారాంధకారాభి దూ*
*షిత దుర్మార్గులు గాన గానబడవో! | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.
నీవే దిక్కు. నిన్ను వదలి వుండలేను అనేవారికి మోక్షము ఇస్తావు కదా.  కానీ ఈ విషయం తెలియని మూర్ఖులు కొంత మంది అన్నము, సంపద అంటూ వాటి వెంట పరుగెడతూ వుంటారు.  జీవించే హక్కు వున్నంత కాలమూ అన్నం దొరుకుతుంది అని వారికి తెలిసి వుండదు.........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*"అన్యథా శరణం నాస్తి! త్వమేవ శరణం మమ! రక్ష రక్ష మహేశ్వర! రక్ష రక్ష జనార్ధన!" అని నీకు మొర పెట్టుకుని, నిన్ను నమ్మి వున్న వారు అందరకీ మోక్షము ప్రసాదిస్తావు కదా, చంద్రమౌళీ!  ఆయు ప్రమాణం వున్న వారందరకీ నీ వల్ల అన్నప్రసాదం దొరుకుతుంది అనే విషయాన్ని మరచి, నీ స్మరణ వదలి, మాయ వల్ల ఐహిక సుఖాలవెంట వెళుతూ వుంటారు కదా! కామాక్షీ ప్రియవల్లభా! సనక సనందనాదులకే నీ మాయ తెలియకపోతే, సామాన్యులము, మా గురించి నీకు మేము చెప్పాలా, గంగాధరా! "రావే వరదా! కావవే!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు