తాతయ్య కథలు-63.;- ఎన్నవెళ్లి రాజమౌళి

  అమ్మ! తాతయ్యకు అన్నం పెట్టి వస్తా.. నాకు కొంచెం అన్నం పెట్టి ఇవ్వు-
ఏ తాతయ్యనే.. శివాలయం దగ్గర .. ఆకలి... ఆకలి.. అంటున్నాడు చూడు ఆ తాతయ్యకు.
ఆయన దగ్గరికి ఎవరు కూడా వెళ్లడానికి ఇష్టపడతలేరు. అదీకాక, తన చుట్టూ అంతా అశుభ్రంగా నే ఉంది. మురికి బట్టలతో, స్నానం కూడా చేస్తలేడు. అన్నం పెట్టినా తినే తట్లు లేడు.
నేనే తినిపిస్తా అన్న కూతురు తో-చిన్న పిల్లవి నీవేమి తినిపిస్తవు. నీవు భయపడతావ్. వద్దమ్మా అన్నది అమ్మ.
నేను వెళ్తాను అమ్మ. నేను ఏమీ భయపడను. ఆకలి... ఆకలి... అని  అరిచే తాతయ్యను చూస్తే నాకు బాధ కలుగుతుంది. అన్న కూతురు తో-
సరే నీ ఇష్టం. అని , అన్నం పెట్టి ఇచ్చింది. ఆ అన్నం తీసుకెళ్లి న ఎనిమిదేళ్ళ పాప తాతయ్యకు తినిపించేసరికి-తన కూతురును దగ్గర కు తీసుకుని, నీలో ఇప్పుడు మదర్ తెరిస్సా ను చూసానుఅని, ఆనంద భాష్పాలు రాల్చింది అమ్మ.