కవిసింహము డా.దాశరథికృష్ణమాచార్యులు :*కట్టరంజిత్ కుమార్**తెలుగు ఉపన్యాసకులు**సిద్ధిపేట**చరవాణి :- 6300474467*

 *(01) తే గీ.*
*మన తెలంగాణ మందున తనకలంబు*
*విప్లవాగ్నులు కురిపించి వెల్లివిరిసె*
*గుబులు పుట్టించె నైజాము గుండెలోన*
*దాశరథికృష్ణమాచార్య ధైర్యశాలి!!!*

*(02) తే.గీ.*
*"నా తెలంగాణ కోటిరత్నాలవీణ"*
*యను నినాదమ్ము పలికె తానద్భుతముగ*
*యీ "తెలంగాణ మారైతుదే"యటంచు*
*చాటిజెప్పెను పద్యపూదోటలోన!!!*

*(03) తే.గీ.*
*అల నిజాము దుశ్చర్యలనన్నిజూసి*
*వ్రాసె జైలుగోడలపైన వాసిగాను*
*నవతరమునకు స్ఫూర్తిని నమ్మకముగ*
*కల్గజేసెను యుక్తితో  కార్యశీలి!!!*

*(04) తే.గీ.*
*కలము ఝళిపించి , గర్జించి , వెలుగుపంచి*
*అభ్యుదయకవిగా తానునడుగువేసి*
*యుద్యమానికి యూపిరిలూదినిలిచి*
*దాశరథికృష్ణమాచార్య ధన్యతగొనె!!!*

*(05) ఆ.వె.*
*అగ్నిధార కావ్యమబ్బురముగ వ్రాసి*
*పొందుపరిచెభావములను మెండు*
*చదువవలెను సతము , మదియెంతొనుప్పొంగి*
*కవినిగాంచవచ్చు కన్నులార!!!*

*(06) కం.*
*"కవిసింహ"మె దాశరథియు*
*కవిలోకము నేలితాను ఘనతను బొందెన్*
*రవివలె నుదయించియు మా*
*భవితకు నాదర్శమయ్యి పథమును జూపెన్!!!*
*(07) మ.*
*రసవత్కావ్యములన్ రచించితివి , ధారాపాతమై నీవు మా*
*రసనాగ్రమ్మున నిల్పినావు భువిపై , రంజిల్లె నీకైతలే*
*మిసిమిన్ పంచెడి సోయగమ్ముగన సమ్మేళింప సంభావ్య మం*
*దసమాన ప్రతిభారవీ ! కవివి నందానందమోదమ్ముతో!!!*

కామెంట్‌లు