తాతయ్య కథలు-65.. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 తను చచ్చే మందు తీసుకుంటారు రా... ఎవరైనా.. ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన టానిక్ తీసుకుంటారు కానీ,
అని తాతయ్య నాన్నతో అంటుండగా మనవడు వచ్చాడు..
ఏంటి తాతయ్య. ఏదో మందు  అంటున్నావ్. కొడుకు తో అన్నది మనవడికి చెప్పి, మీ నాన్న కారు కొందామని అంటున్నాడు రా. మన సంపాదన ప్రకారం నడుచుకోవాలి కానీ, ఎవరో కారు మీద  వెళ్తున్నారని, మనంకారు కొందా మా.. తోటి వాడు తొడ కోసుకుంటే ఎవడో మెడ కోసుకున్న ట్లు అవుతుంది.
బాగా చెప్పావు తాతయ్య. ఇప్పుడు నాన్న కారు కొందాంఅనుడు ఏమో కానీ, 2 సామెతలు విన్నాను అన్నాడు మనవడు. నీవన్నీ నా పోలికే లేరా. మీ నాన్న వి అన్ని మీ నానమ్మ పోలికలు అనగానే-వంటిల్లు నుండి వచ్చిన నానమ్మ-నాకన్నీ  నగలు దిగ వేసిన వు అనగానే, ముగ్గురు నవ్వగా-మూతి ముడుచుకుని ఇంట్లో కి వెళ్ళింది నానమ్మ.