తాతయ్య కథలు-67...:- ఎన్నవెళ్లి రాజమౌళి

 నాన్నా  పొలము అమ్మి బిల్డింగ్ కట్టు కుందామా! మనకు ఉన్నదే... ఎకరం. ఆ ఎకరం పొలం అమ్మితే ఎట్లా రా -
తలెముంతలు అమ్మి చెప్పులు కొనుక్కున్నట్టు అవుతది.
ఇప్పుడు మనకు పెంకుల ఇల్లు ఉన్నది కదా! తాతయ్య.
అవున్రా నీవన్నది నిజమే. మొత్తానికి ఇల్లు లేకుంటే నో... లేక 10 ఎకరాలు భూమి ఉంటే నో.. ఆ భూమి నుండి ఎకరం అమ్మితే ఏం కాదు. అన్న తాతయ్య తో-
పై సామెత అర్థమేంది తాతయ్య. బాగా అడిగావు రా ఏది ముందు. ఏది వెనుక అనేది చూడాలి.
మన సంపాదన తీరు మసలుకోవాలి. చెప్పుల అవసరమే.. కాదనను. కానీ,తలెముంతలు ముందు కావాలి కదా. వాటిని కాపాడు కుంటూ తర్వాత చెప్పులు కొనాలి. అని తాతయ్య అనగానే-
నేను ఉద్యోగం చేశాక బిల్డింగు కట్టుకుందాం తాతయ్య. శభాష్ మనవడా బాగా చదివి, నువ్వు  అన్న పని చేయి అన్నాడు తాతయ్య.