*ముత్యాల హారాలు*:-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464
1.  ఆకాశంలో మెరిసె
     అందమైన సింగిడేసె
     నింగిని కనువిందు చేసె
     రెప్ప వాల్చకుండ చేసె..

2.  తుమ్మెదలు వచ్చాయి
     పువ్వుపై వాలాయి
     మధువును గ్రోలినాయి
     హాయిని పొందినాయి

3.  సీతకు బొట్టoదం
     పాపకు జుట్టందం
     ఇంటికి పూలందo
     మెడకు హారమందం

4.  ప్లాస్టిక్లు వాడకము
     ఆయువుకే ప్రమాదము
     అవగాహన పెంచుదము
     అరికడితే ప్రమోదము

5.  మంచి అలవాట్లు పెంచకొ    
     ఆరోగ్యం కాపాడుకొ
     ఆయుష్షును పెంచుకొ
     ఆనందం పంచుకొ

6. పరిసరాలు శుభ్రంగా
    ప్రకృతిలో సహజంగా 
    చేసి చూపు ఇష్టంగా
    శుభమై నిలువంగా

7 .సహజమైన గాలి ఏది
    సహజమైన తిండి ఏది
    సహజమైన నవ్వు ఏది
    కల్మషం యాంత్రికo ఇది

8. ట్రాఫిక్లో నియమాలు
    మీరితే జరిమానాలు
    పెట్టుట ఏల గగ్గోలు
    గౌరవించు చట్టాలు

9. టీ వీ లకు తల్లులు
    సెల్ఫోన్లో నాన్నలు
   ఆన్లైన్లో పిల్లలు 
   కలికాలం విలువలు

10. వరకట్నం ఎవడి సొమ్ము
      తీసుకొనుట నీకు దమ్ము
      చేయకు ఆశలు వమ్ము
      గౌరవంగ నిలుపు మమ్ము


కామెంట్‌లు