*దాశరథిగారికి ముత్యాలహారాలు*:-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464

 1.
తెలంగాణా వీరుడు
అభ్యదయాలకు పురుడు
ఆవేశాలకు తోడు
దాశరథి గారు చూడు
2.
ఆవేశం ఉన్నది
అక్షర రూపమొచ్చినది
తెలంగాణ మేల్కొన్నది
స్వాతంత్ర్యo పొందినది
3.
ఆరాచకత్వం చూసె
అక్షర యుద్ధమే చేసె
పద్యాలలో తను వ్రాసె
బానిస విముక్తం చేసె
4.
కవితా సంపూటాలు
సినిమాల గేయాలు
సాహిత్య అవార్డులు
దాశరథి సొంతాలు