*ముత్యాల హారాలు*చైతన్య భారతి పోతుల హైదరాబాద్ 7013264464
1.   మంచి అలవాట్లు పెంచకొ    
       ఆరోగ్యం కాపాడుకొ
       ఆయుష్షును పెంచుకొ
       ఆనందం పంచుకొ

2. నాడు ప్రజలే పిల్లలు
        నేడు పిల్లలే ప్రజలు
       ఎదిగారు నాయకులు
       మారాలి ప్రజాతీర్పులు

3.   డబ్బులు ఎక్కువగా
       జబ్బులు మిక్కిలిగా
       ఆనందం ఆవిరిగా
       ధర నూకలు చెల్లెగా

4.   దానాలు పెంచుమురా
       ప్రేమను పంచుమురా
      సంతృప్తి పెరుగునురా
      సంతోషం మిగులునురా

5.     పోషకాహారం పెట్టు
        భౌతిక దూరం పెట్టు
        మూతికి మాస్కు పెట్టు
        కరోనా ఆటకట్టు

   6.   పేదవారి సంసారం
          వైద్యం పెనుభారం
          లేదు మరి ఆదారం
          చూపండి పరిష్కారం

7.    పరీక్ష భయం లేదు
       ఫెయిల్ అయ్యే పని లేదు
       చావుల భయం లేదు
       సరైన జ్ఞానం లేదు

8.  భూదేవి కళ్యాణం
      ప్రకృతిలో కళ్యాణం
     తరువులతో నిర్మాణం
     అది మానవ కళ్యాణం

9.. ప్రేమ

ఆకర్షణలు
     పెద్దలనెదిరించడాలు
     పారిపోయి వివాహాలు
     ఆపైన విడాకులు

10. అబ్బాయిల వివాహాలు
      వరకట్నపు బేరాలు
      అంగట్లో సరుకులు
      భార్య కీలుబొమ్మలు

కామెంట్‌లు