తాతయ్య కథలు-72..ఎన్నవెళ్లి రాజమౌళి

 విస్తరి లో అన్నం తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి.
ఇంకా పులుసు కావాలిఅంటున్నవు ఏందిరా. ఇప్పటికే తగ్గట్టు పులుసు పోసుకున్నావు. పులుపు ఎక్కువ అయితే అన్నం కొట్టుక పోతది తెలుసా?
ఇది కూడా సామెత నేనా తాతయ్య. ఇది  అద్భుతమైన సామెత.
అన్నంలకు ఎంత అవసరం ఉంటే... అంతే పులుసు  ఎలా పోసుకుంటామో.. సంసారం కూడా అంతే.. హద్దులలో ఉండాలి.
మన స్థాయికి మించిన పని చేస్తే అసలుకే మోసం వస్తుంది.
అంటే... అర్థమేంది తాతయ్య.
నీ సంపాదనకు తగ్గట్లే నడుచుకోవాలి. ఆ మందం లోనే మసలుకోవాలి అన్నమాట. పైన చెప్పిన  సామెత లేక్క అయితే.. పులుసు ఎక్కువైతే అన్నం కొట్టుకొని పోయినట్టు... హద్దు మీరితే మొదలు కే మోసం వస్తుంది. బాగుంది తాతయ్య సామెత అన్నాడు మనవడు.