తాతయ్య కథలు-76..-ఎన్నవెళ్లి రాజమౌళి

  తాతయ్య! మా ఫ్రెండ్ వాళ్ళ కు పెద్ద బిల్డింగ్, కారు ఉన్నా వాళ్లు కూడా ఇంకా చాలు త లేదు అంటారు అనగానే-
సంపాదన బాగా ఉన్న వాళ్లు ఆ తీరుగానే ఖర్చు పెట్టుకుంటారు. అని తాతయ్య అన్నాడు.
మరి లేని వాళ్ల సంగతి ఎలా తాతయ్య. నువ్వు అన్నది నిజమే... లేని వాళ్లకు ఇబ్బంది అవుతుంది. కానీ, వాళ్ల స్థాయి లో వాళ్లు ఖర్చు పెట్టుకోవడానికి చూస్తుంటారు. అందుకే  ఎంత చెట్టుకు అంతే గాలి. అని అంటారు.
కొన్ని విషయాలలో తృప్తి పడతారు. ఇంకా కొన్ని విషయాలలో తమకంటే పై వాళ్ళతో పోటీపడ చూస్తారు.
ఇలా అయితే ఇబ్బందే కదా తాతయ్య. అందుకే ఎప్పుడైనా తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్లను చూసి తృప్తి పడాలి అంటారు. బాగా చెప్పావు తాతయ్య అన్నాడు మనవడు.