తాతయ్య కథలు-78. ఎన్నవెళ్లి రాజమౌళి

 ఇంటిలోకి వస్తూనే-ఏమాయే. మీ స్నేహితురాలు జ్వరంతో బాధ పడుతుంది అన్నావు. వెళ్ళవా! అని, శంకరమ్మ తో అన్నాడు భర్త.
వెళ్ళలేదు అని అంటుండగానే...  ఎందుకుతాతయ్య. నానమ్మను ఎక్కడికో వెళ్ళ లేదా అంటున్నావ్ అనగా-
వాళ్ల స్నేహితురాలికి జ్వరము వచ్చిందట. పరామర్శించడానికి.
పరామర్శించడం అంటే ఏమిటి తాతయ్య.
ఎవరైనా బాగా లేనప్పుడు... లేదా పెద్ద మనుషుల దగ్గరకు వెళ్లి మాట్లాడించ డాన్ని పరామర్శ అంటారు.
జ్వరం వచ్చిన వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకెళ్తారా తాతయ్య.
బాగా అడిగావు ఏవైనా పండ్లు తీసుకు వెళ్తారు. అయితే అమ్మమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు నేను పండ్లు తీసుకు వెళతాను. శభాష్ మా మనవడు పండ్లు తెచ్చాడని సంతోషపడుతుంది మీ అమ్మమ్మ అన్నాడు తాతయ్య.
కామెంట్‌లు