తాతయ్య కథలు-79..:- ఎన్నవెళ్లి రాజమౌళి

 బర్రె.. బె... బె.. అని అరుస్తుంది. తెచ్చిన గడ్డి అక్కడనే ఉన్నట్టుంది. ఆ గడ్డి వేయలేదా? అని తాతయ్య నానమ్మ తో అనగా...
అప్పుడే వేశాను. ఏం వేసావ్ రామయ్య తెచ్చిన గడ్డి అక్కడనే ఉంది.
నానమ్మ వచ్చి చూసి-అయ్యో మర్చిపోయాను. వేశాను అనుకున్నా...
నువ్వు తినకనే.. తిన్నాను అంటావా .అని తాతయ్య అంటుంటే...
అక్కడికి వచ్చిన మనవడు-ఏమి టి తాతయ్య నానమ్మ నుఏమో అంటున్నావు. అన్నాడు.
బర్రె గుంజ కాడ గడ్డి వేస్తున్నా తాతయ్య తో...
బర్రెకు బాంచోడు కావాలి. ఎంత చేస్తే అది మనకు పాలు ఇస్తుంది.
బర్రె పాలు అయితే కావాలి. కానీ, సేవ మాత్రం చేసుడు వద్దా అన్నాడు తాతయ్య.
బర్రెకు బాంచోడు కావాలి అంటే ఏంటి తాతయ్య.
బర్రె ఉండగానే సరిపోదు. ఆ బర్రెకు నీళ్లు పెట్టాలి. గడ్డి వేయాలి. బయటకు తీసుకెళ్లి మేపుక రావాలి. కుడిది పోయాలి. అప్పుడే అది మనకు మంచిగా పాలు ఇస్తుంది. అందుకే... బర్రెకు బాంచోడు కావాలి అనే సామెత వచ్చింది. అంటే సేవ చేసేటోడు  ఉండాలి. అన్నాడు తాతయ్య.
కామెంట్‌లు