తాతయ్య కథలు-83.. ఎన్నవెళ్లి రాజమౌళి

 పొద్దుగూకే దనుక పనేనా రా. ముందు మొదలు పెట్టి కొంత పొద్దు ఉండే వరకే అంత పని అయిపోవాలి.. అన్న నాన్నతో-పొలం పనులు నాన్న. ఎంత చేసినా అయిపోవు.
ఎందుకురా. ఏ పని చేసిన ఆలస్యంగా మొదలు పెడతా వు. పనులు కాలేదని బాధ పడతావు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.  అని నాన్న అనేసరికి-
ఇప్పుడు అన్న సామెత అర్థమేంది తాతయ్య అన్నాడు మనవడు.
చీకటిలో ఏ పనైనా చేస్తామా! అందుకే దీపం ఉన్నప్పుడు మన పనులన్నీ అయిపోతే ఇబ్బంది ఉండదు కదా.. అందుకే  దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకో వాలి అన్నారు.
ఈ సామెత పొద్దు విషయంలో కూడా వాడవచ్చు. పొద్దు గూకినాక ఇంకేమి పని చేస్తాం. అన్నాడు తాతయ్య.
ఇది చదువు విషయంలో కూడా ఉపయోగించుకోవచ్చు నా తాతయ్య? బాగా అడిగావు ఎప్పటి పాఠం అప్పుడు నేర్చుకుంటే.. పరీక్షలప్పుడు ఇబ్బంది ఉండదు కదా అన్నాడు తాతయ్య. ఇప్పటినుండి నువ్వు చెప్పినట్టే నేర్చుకుంటాను తాతయ్యా.
కామెంట్‌లు