ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999

 మనం తినే బువ్వ 
మన తలెలకు ఎట్లత్తదొ,
రైతులు  పొలాలల్ల
ఎంత కట్ట పడుతరో
పట్నపోల్లకు తెలుసో తెల్వదో.
పల్లెటూరోన్ని
గా ముచ్చట రాత్తున్నా
జెర సూడుర్రి.
గప్పట్ల
కచ్చురంల పొనుకను ఏసి
ఇంటి దగ్గెరున్న పెంటను
దాంట్ల పోసుకొని పొలం కాడికి జార గొట్టే టోల్లు. దొయ్యలల్ల 
గా ఎరువును పోసినంక
నీళ్ళు వెట్టి,బగ్గ నాని నంక
రెండు ఏడ్ల తోనో,
దున్న పోతుల తోనో నాగలితో
దున్ని ,గొర్రు గొట్టి ఉంచుతరు.
కొందరైతే 
పొలంల బలం ఉండాల్నని తంగడి సెట్లను కొట్టుకచ్చి 
గా పొలంల తొక్కేటోల్లు.
ఇగ
ఇంటి దగ్గెర  కుందెన్ల గాని,
పెద్ద గుల్లల గానీ 
అడ్లను మండే పోసేటోల్లు
పొద్దు ,మాపు నీళ్ళు పోత్తే
మూడు, నాలుగు దినాలకు
మెల్లగ మొలకలు అత్తయి.
గా మొలకను ఇచ్చ గొట్టి
గుల్లలల్ల తీసుక వోయి
ఒక మడిల మొలకను సల్లుతరు.
కొద్ది దినాలకు మొలకలు వోయి నారు పెరుగుతది.
గా నారును 
నెల గాక ముందే పీకి
ఏరే దొయ్యలల్ల నాటేత్తరు.
పొలాలల్ల 
నాటేసుటానికి/ అరేసుటానికి
ఆడోల్లను కైకిలికి పిలుత్తరు.
కొందరు బదలుకు గుడ అత్తరు. 
ఐదారుగురో, పది మందో ఆడోల్లు కూడి అరి ఏసుడు గుత్తకు పడుతరు.
అరేసుడు గుత్తకిత్తే పని జెప్పన అయితది.
కొద్ది దినాలకు 
అరి పెరుగుతది. 
గా అరిల బెరికి కర్రలు గుడ 
పెద్దగ పెరిగేటివి
గా బెరికి కర్రలను
ముదురు కలిసే టప్పుడు
తీసేసేటోల్లు.
అడ్లు బగ్గ పండాల్నని మందులను సల్లే టోల్లు.
రోగాలు రాకుంట
ఎండ్రిన్,మందులను
పిచికారీ జేసీటోల్లు.
కరెంట్ రోజుకు నాలుగైదు గంటలు గుడ సరిగ 
రాక పోయేది.
గా కరెంట్ ఎప్పుడు అత్తదో, ఎప్పుడు పోతదో 
ఎవ్వరికీ తెల్వక పోయేటిది
పొలంల నీళ్ళు పెట్టుకుంట
దొయ్యల్ల ఉన్న అరిని
పసి పిల్లల లెక్క 
సూసుకునే టోల్లు.
నాలుగు నెలలకు పంట
సేతికచ్చేది.
ఎండాకాలం ల సెడగొట్టు ఆనలు గొట్టి అడ్లన్ని నీళ్ళ పాలు అయ్యేటివి.  
గా అడ్లకు ల్యాకలు అచ్చెటివి.
ఇగ ఆన కాలంల 
అరిగోస పడేటోల్లు.
పంట ఇంట్ల కచ్చేదాక నమ్ముకం లేదుల్లా!
గంతే కాదుల్లా,
ఈ లోకంల
అస్తువలు తయారు సేసినోల్లే
ఆటికి దర సెప్పి
అమ్ముకుంటరు.
మరి గదేమి ఇసిత్రమో గని
అరి గోస పడి 
పంట పండిచ్చిన రైతుకు మాత్రం దర సెప్పుకొని అమ్ముకొనే ససంత్రం లేదు.
గప్పట్ల
సరిగా కరెంట్ రాక, నీళ్ళు లేక
ఎవుసం జేసుడు దండగే.
కానిప్పుడు 
మున్నూట అరువై ఐదు
దినాలు కరెంట్,నీళ్ళు
అత్తున్నయి.
ఎవుసం జేసుడు 
ఇప్పుడు పండుగే. 
సేసుకున్నోల్లకు సేసుకున్నంత
ఎవరు ఔనన్నా,
ఎవరు కాదన్నా
కరెంట్,నీళ్ళు ఇత్తున్న
కేసిఆర్ రైతు బాందవుడే!
ఔ మల్ల!