*ఖడ్గమైన కవిత్వము*:-*మచ్చరాజమౌళి*9059637442*దుబ్బాక**సిద్దిపేట జిల్లా*..
అంటరానివాడంటూ అవమానాలు భరించి
అక్షరాన్నే ఆయుధంగా మలుచుకుని
మూఢాచారాలపై తిరగబడ్డ ధీరుడు 
ఛీత్కారము పొందిన చోటే 
సత్కారము పొందినఘటికుడు 

ధళితులపై చూపుతున్న వివక్షను 
ఆ విశ్వనాథునికి వివరించాలని 
గబ్బిలం ' తో రాయబారం చేయించాడు 

చెప్పుడుమాటలతో 
తప్పుడు నిర్ణయాలకు బలిఅయిన
కవి ఆత్మఘోషను, 
హృదయాంతరాలను తడిమిచూసేలా
ఫిరదౌసి ' లో చూపించాడు 

బిరుదు

లు, సత్కారాలూ
అత్యున్నత పురస్కారాలు
అన్నిటినీ పెనవేసుకున్న కవిదిగ్గజము
సామాజిక అంశాలే నేపథ్యంగా 
సమాజాన్ని చైతన్య పరిచిన కవి జాషువా...