లాక్ డౌన్ చదువు :-గాజులనరసింహ--9177071129

 పల్లవి:- 
అరె వద్దురబాబు చదువు
తలకెక్కుతుంది బరువు అరెరే ..2
ఆడుతు పాడుతు చదివే చదువు అది చూడు
ఉన్నచోటనే ఉండి చదివే చదువు ఇది చూడు
తికమవుతుంది తలతిరిగిపోతుంది
అరె గజిబిజిగా ఉంటుంది మెదడు గల్లంతౌతుంది ""పల్లవి""
చరణం:- 1
ఇదేమి రోగమో వచ్చెను కరోనా
అన్నీ బంధించి పెట్టెను హైరానా..
కో""ఏందిరబాబు గొడవ అరెరే ఏందిర బాబు ఈ గొడవ ..2
కామెంట్స్ చేయడానికి షేరింగ్ చేయడానికి 
లేరెవరు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటే పెద్దబోరు
ఇది భరించాలి  ఎన్నాళ్ళు ఇలా చదవాలి ఎన్నాళ్లు  
ఇక భరించలేమురో అయ్యో దేవుడో నీకు దండంరో...""పల్లవి""

చరణం:-  2
అమ్మానాన్నకు చదువు రాదు 
ఇరుగుపొరుగు చదివినవాళ్ళు లేరు
సమస్యలొస్తే ఎలా తెలుసుకోవాలి 
అర్థంకాని పాఠం మళ్లీ ఎవరిని అడగాలి 
అరె బయట చూస్తే ఉంది నిబంధన  
ఇంట్లోనే ఉంటే నిర్బంధన నిర్బంధన 
ఎట్టాఎట్టా చెప్పయ్యో  మా చదువులు సాగేదెట్టయ్యో...2""ఇది ఏమి రోగం కో   ""పల్లవి""

కామెంట్‌లు