కంద పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 కం
శిరమున గంగను దాచిన
తరుణము గుర్తుంటెచాలు తపనలు యేలన్
నురికే జలవాహినికై
శిరమే స్థానముగ మార్చె శివ పరమాత్మా
కం
ఉప్పెన పుట్టించినచో
తిప్పలనెందులకు గనుట తిరగలి వోలెన్
తెప్పలుగా వత్తుననుచు
ముప్పులు ప్రకటించమంచి బుధులేకారే
కం
ఇరువురి చేతుల తప్పెట
సరళముగా వచ్చు సుమ్మి సరదాలేలన్
పరులేవిధి గుర్తింతురు
కరముల సవ్వడిని వినని ఘనకార్యములన్
కం
సరదా మాటలు కలిపిన
చిరుబురు లాడిన జనులతొ శృతి యెట్లుండున్
కరముకు కరమే తోడై
వరముగ బతుకమ్మ నాడ వచ్చును సరదా
కం
పరిపరి విధముల నొక్కుచు
విరిచిన మదినతికెదనను వివరములేలన్ 
నిరతము మనసద్దమ్మే
జరజరజారిన దొరకదు జగడము తగునా
కం
జీవికి బ్రతికే హక్కులు
భావితరము మరచుటేలవదులుము పంతమ్
నావల కడ్డము రాకుము
కావలసిన రైలునాపు కండలు గలగన్
కం
కావుమనుచు వేడితిమా
రేవు మరచి తొంగి చూడ రీతేవిధమౌ
చేవకు తగినది కాదే
తావుకు నీ యునికి లేదు తగ్గుము మనసా!
కం
అందరు మనవారేనని
సుందరముగ కలిసి పోను చొరవకుదిగుచున్
పొందుగ ముందరకేగిన
గందరగోళమున బడిన ఘనతనుకంటిన్
కం
మంచిని యాసర జేసుక
వంచించడ మేమి ఫలము బాధలె మిగులున్
కొంచము యోచించు మెపుడు
పంచన తీయని మమతలు పారును కనరే
కం
భావన లేనట్టి జనుల
తోవకు దారేయు టేల దూరము పెరుగున్
గూవలు గులకలు వేరౌ
తోవకు లేనట్టి దారి తొక్కకు మనసా!