దత్తపదులు:-:-మమత ఐలహైదరాబాద్9247593432

 మనము ధనము కనము వినము
కం
మనమున శారదను నిలిపి
ధనముకు మిన్నైన గాత్ర దారను కూర్చున్
కనకముకది సాటియవున
వినమందుర కమ్మదనపు విద్వాంసుడినిన్
నరులు విరులు తరులు గిరులు
కం
నరులకు నందనవనమై
తరులు మెరియు శోభతోడ చక్కదనముతో
విరులందించును సొంపుగ
గిరులకు ఝరులకు నడుమ ప్రకృతినే గాంచన్
దేహము గేహము మోహము దేహము
కం
గేహము విడనాడు తపము
దేహము వస్త్రముగ జూచి దేవుని కొరకై
దేహము పైనేవిద వ్యా
మోహము లేనట్టి యోగి మోక్షము పొందున్