ఆశువులు:-మమత ఐలహైదరాబాద్9247593432

 అంశం:-నీతి నిజాయితీలతీరు
కం
నీతికి కాలము చెల్లెను 
ఖ్యాతికొరకు పాకులాట ఘనముగ పెరిగెన్
మోతాదుకు మించిన పలు
రీతుల మోసాలు భువిన లెక్కకు మించెన్
అంశం:- నేటి కాలంలోసత్యం యొక్క స్థితి
కం
సత్యానికి కష్టాలని
నిత్యము కనిపించుచుండె నీడను కనమా!
పత్యము చేయుట మాని న
గత్యమె నలతలకు నాంది కాగలదు సుమా!
అంశం:-నేటి బడి గుడుల స్థితి
కం
గుడిలో నీగల మోతలు
బడిలో మానిన నికషలు వరముగ మారెన్
సడితో వచ్చిన క్రోవిడు
తడిపెను స్థితి గతులన్ని దయనీయముగన్
అంశం:-మానవసేవయే మాధవసేవ
గొప్పతనం
కం
మనసే మాధవు డైనను
తనపర ధోరణిని మాని తగుసాయమగన్
జనులకునుపయోగమ్ముగ
మనవంతుగ సేవజేయ మనుజుల రీతౌ
అంశం:-సత్యభామ అధికారప్రేమ
కం
జనులను కలవర పరిచెను
తనవాడే కృష్ణుడనుచు ధనముతొ తూచెన్
కనివిని యెరుగని ప్రేమకు
తనగర్వము నెంచదగున ధరణిన సత్యన్