*సీసమాలిక*:-బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా: సిద్దిపేటచరవాణి:9391097371.

 నవమాసములుమోసి నవనిలోబిడ్డకు
పురుడునుపోయును ముద్దుగానె
యడుగులు మోపగ హాయినిపొందుచు
నెదకుహత్తుకొనును ముదముతోడ
పాలను త్రాగించి పాపయే నడవంగ
శక్తినినింపును యుక్తికొరకు
గోరుముద్దకలిపి కోరియుతినిపించి
కడుపునింపుచునుండు కొడుకుకెపుడు
నడకనునేర్పించి నచ్చినరీతిన
దరికిజేర్చునెపుడు దండిగానె
యాపదల్రాగను నండగనిలబడి 
ధైర్యమునింపును తల్లిగాను
మంచితనంబును మర్యాదలనునేర్పి
ప్రేమనుపంచును ప్రీతితోడ
గొప్పపేరునెతెచ్చి మెప్పుపొందాలని
నిత్యముకృషిజేయు నేర్పుగాంచి
కష్టమురాకుండ కంటికిరెప్పోలె
కాపాడుకొనుచుండు గారబముగ
*ఆటవెలది*
మాతృమూర్తియైన మనయమ్మదైవమై
కన్నప్రేమజూపి కాపుగాచు
ఆకసమునకన్న అమ్మప్రేమయెమిన్న
బాధపెట్టవలదు భావితరము.