ఆడపిల్ల తల్లిదండ్రుల కష్టాలు:-బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371

 సీసమాలిక
తల్లిదండ్రులెపుడు తనయనుకనగానె
ధనముపొదుపుజేయు తగినవిధము
బిడ్డలపోషించి ప్రీతిని నింపుచు
వయసుకు రాగానే వరుని వెదకి
పెళ్ళినిర్ణయమెల్లపిల్లయింట్లోనను
సాగుచునుండును వేగిరముగ
కళ్యాణ మైపోగ కట్నాలనిచ్చియు
కూతుర్ని పంపును కోడలిగను
కొత్తబట్టలుదెచ్చికూతురల్లుడికేను
సంతసంబునపెట్టి సాగనంపు
బడెబాసనులుదెచ్చి బాధ్యతతోడను
అత్తవారిల్లంత కొత్త గేను
ఆడపడచులాకు నానందమునుపంచ
చీరసారెలుపెట్టు గౌరవముగ
వియ్యాలవారికి విందులుజేసియు
మర్యాదనిచ్చును మమతతోడ
బంగారమునుకొని బాగుగాబిడ్డను
ముత్తైదువుగజేయు ముద్దుగాను
పొలమునంతనెయమ్మి పొంతనలేకుండ
నప్పులే జేస్తారు ముప్పుయనక
బాధలుపడుకుంటు బాగుగాబిడ్డను
సాగనంపురపుడు సర్వమమ్మి
*తేటగీతి*
కట్నమునుతీసుకోకుండ కలసియుండి
స్త్రీ పురుషతేడజూపక క్షేమమెరిగి
సమముగానందరినిజూడ సకలమంత
బాగుపడునుసమాజము భవితలోన
.