మునగఆకు ఉపయోగం :-బెజగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371
1.ఆటవెలది
మునగఆకుతీసి ముద్దుగాజనులంత
పొడినిజేయుచుండు పొందుగాను
పోషకములపెంచినౌషధములనిచ్చు
రక్షణిచ్చుమనకు లక్షణముగ


2 *ఆటవెలది*
అవనిజనులకెల్ల నారోగ్యమునుపంచి
హాయిపెంచుచుండు నందముగను
రోగములనుబాపి లోకమునందున
శక్తిపెంచునదియె యుక్తి కొరకు

3.ఆటవెలది
మునగకాయతెంపి ముక్కలుకోసియు
వండుచుండుకూర వనితలెపుడు
రుచికరముగనుండి రూఢిగామనకును
తినుచునుండకొలది తృప్తికలుగు