ఆశ:-రావిపల్లి వాసుదేవరావు-పార్వతీ పురం 9441713136
గగనాన తారకను
తాకాలనీ ఆశ

నింగిలో జాబిలై
వెలగాలనీ ఆశ

ఆకాశ అంచును
చూడాలనీ ఆశ

అంతరిక్షం లోన
ఎగరాలనీ ఆశ

సముద్ర లోతును
ఈదాలనీ ఆశ

ఎత్తైన శిఖరాన్ని
ఎక్కాలనీ ఆశ

పచ్చని చెట్లను
పెంచాలనీ ఆశ

ఈ పుడమి తల్లిని
కాపాడాలని ఆశ