సత్యాన్వేషణ.;-తాటి కోల పద్మావతి గుంటూరు. సెల్ నెంబర్.9441753376

 కాలంతో పాటు పరిగెడుతూ 
ప్రతి అడుగులో సప్త వర్ణాలను తిలకిస్తూ 
ప్రతి దిక్కు మలుపులో చంద్రుని నీడలా 
చాటున విశ్రమించి చాలనుకున్నా.
కానీ నీ అటువంటి ఆనవాళ్ళు కానరావటం లేదు.
ఆగమ్యగోచరంగా అస్తవ్యస్తం అడుగుజాడలలో 
గుట్టలుగుట్టలుగా ప్రత్యక్షమవుతున్నాయి 
ప్రేమ రహిత శిలాఫలకాలు.
విడిపోయినా మానవ సంబంధాల బాంధవ్యాలను 
మళ్లీ కలవటానికి వారధి కట్టాలనుకున్న.
ఆనంద సాగరాలను తుఫానులతో చెలరేగి
 అల్లకల్లోలమై పోతుంటే ఆనకట్టలు వేయాలనుకున్న.
అంతిమ శ్వాస లైన వాకిలి ముంగిట్లో 
సంతోషంగా సాగనంపాలి అనుకున్న.
పగలు రేయి సంగమంలో దుఃఖపుటలలను 
ఆవలి తీరానికి చేరాలనుకున్నా.
నడిచే మార్గాలన్నీ ముళ్లబాట లై ఎదురవుతుంటే 
అరువు తెచ్చుకున్న ఆనందాన్ని అప్పుడప్పుడు 
గుర్తు తెచ్చుకొని దగాపడ్డ బతుకులకు బాసటగా 
నిలిచి దిశ మార్గం వైపు నడిపిస్తూ ధైర్య వచనాలు
 కలగాలని నిశ్శబ్దం నీడల్లో నా చూపులు ఆకాశం వైపు 
సారిస్తూ ప్రభావిత ఉషోదయా లకు సుప్రభాతం 
ప్రాణాలని ప్రతినిత్యం సత్యాన్వేషణ చేస్తున్న.
కామెంట్‌లు