బిడ్డలు.:- తాటి కోల పద్మావతి గుంటూరు సెల్ నెంబర్ 9441753376

 ఎల్లమంద కు రెండెకరాల పొలం ఉంది. దానితోపాటు రెండు ఎద్దులు కూడా ఉన్నాయి. అవి తండ్రి ఇచ్చిన ఆస్తి. వాటిని కొడుకు లాగా చూసుకుంటాడు. ఎల్లమంద కు రత్నం భార్యగా వచ్చింది. ఆమె కూడా అ ఆ రెండు ఎద్దులను బిడ్డ లాగానే చూసుకుంటుంది. కొన్నాళ్ళకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు పుట్టారు. ఉండటానికి రెండు గదుల పెంకుటిల్లు మాత్రమే ఉంది. ఇంటి చుట్టు పక్కన పెద్ద ఖాళీ స్థలంలో ఎడ్ల కోసం ఒక పాక వేశాడు
. సాయంత్రం ఎల్లమంద పొలం నుంచి రాగానే ఎడ్లు 2 మోర పైకెత్తి చూస్తాయి. వాటిని ప్రేమగా నిమిరి మేత వేసి కుడితి నీళ్లు పెట్టి తృప్తిగా చూసుకుంటాడు. ఉదయం సాయంత్రం కూడా పాక శుభ్రం చేసి ఉంచుతారు. ఆ ఎద్దుల తోనే రెండెకరాల పొలం సాగు చేస్తాడు. మిగతా రైతులు కూడా ఎల్లమంద ఎద్దుల నే పొలం దున్నడానికి తీసుకువెళ్తారు. పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు ఎక్కువ అయినాయి. పెద్ద కొడుకు డిగ్రీ చదువుతానంటే చదివించాడు. కూతురి పెళ్లి కోసం ఒక ఎకరం పొలం అమ్మవలసి వచ్చింది. మిగిలింది ఒక ఎకరం. పెద్ద కొడుకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు లంచం ఇస్తే గాని ఉద్యోగం ఇవ్వరు అన్నారట. పాతిక వేలు కావాలన్నాడు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది ఈ ఉద్యోగాలు ఎందుకు పొలం పని చూసుకో మన్నాడు. చిన్నవాడు ఎలాగు తండ్రికి వ్యవసాయంలో సాయ పడుతున్నాడు. డిగ్రీ చదువుకొని ఉండమంటావా మట్టి తీసుకొని బతుకమ్మ అంటావా అలాంటి పనులు నేను ఎప్పటికీ చేయను. నేను ఉద్యోగం చేయాల్సిందే అంటూ పట్టుబట్టాడు. చేతిలో పైసా లేదు ఏం చేయాలి. ఎద్దుల్ని అమ్మ మన్నాడు. ఆ మాటకు ఎక్కడలేని కోపం వచ్చింది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఎద్దులు నమ్మను అవి మీకంటే ముందే ఇంట్లో లో పెరుగు తున్నాయి వాటి తరువాతనే మీరు పుట్టారు. నాకు మీరు ఎంతో అవి అంతే నన్నాడు. మమ్మల్ని ఎద్దుల తో పోలుస్తారా. మేము అవి ఒకటే ఎలా అవుతాము. అవి కావాలో మేము కావాలో తేల్చుకో మన్నాడు. ఎల్లమ్మ ఎందుకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఉన్న ఎకరం కూడా పంటలు పండటం లేదు తిండి గింజలు కూడా కరువైపోయింది. ఎద్దులు ముసలి అయిపోయాయి మేపటం కూడా కష్టంగా ఉంది. చిన్న వాడు కూడా అన్న బాటలోనే నడిచాడు. ఈ పల్లెటూరు లో ఏముంది సంపాదించుకోవడానికి. అదే పట్నంలో అయితే ఎక్కడైనా పని దొరుకుతుంది నేను పట్నం వెళ్తాను అన్నాడు. ఎవరు ఏం చేస్తున్నా నేను మాత్రం ఆ ఎద్దులను అమ్మను అన్నాడు. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఎలమంద కూలి పని చేసి వచ్చి ఆ డబ్బుతోనే గడ్డిమోపు వాటికి వేసేవాడు. అదే యజమానికి ప్రేమ పాత్రంగా ఉంటున్నాయి. భార్య రత్నం కూడా ఎద్దులను అమ్మేయండి. తల్లి పిల్లలు కలిసి ఒకటే పోరు. ఎన్ని విధాల చెప్పినా ఎలమంద మాత్రం వాటిని విడిచి ఉండలేను అన్నాడు. అయితే మేమే ఇంట్లోంచి వెళ్లిపోతా మన్నారు. నాలుగు రోజుల్లో ఆలోచించుకో మని చెప్పారు. ఏం చేయాలో పాలుపోలేదు. ఎద్దుల అంటే బిడ్డ తో సమానంగా చూసుకున్నాడు. అలాంటివాటిని విడిచిపెట్టి ఉండలేనంటూ గట్టిగానే చెప్పాడు. ఆ రోజు ఉదయం ఎల్లమంద పొలానికి వెళ్ళాడు. వచ్చేటప్పుడు పచ్చి గడ్డి మోపు తీసుకువచ్చి రాగానే ముందు పాక వైపు నడిచాడు. పాకలో ఎద్దులు కనిపించలేదు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. భార్యని గట్టిగా పిలిచాడు. ఏమిటండీ ఎందుకు అలా అరుస్తున్నారు అన్నది. నిజం చెప్పు మన ఎద్దుల్ని ఎవరైనా తీసుకుని వెళ్లారా. అవి సాయంత్రానికల్లా పాకలో ఉంటాయి కదా ఏమైనట్లు అన్నాడు. ఇంకేం అవుతాయి మన కొడుకులు ఇద్దరూ కలిసి వాటిని అమ్మేశారు అన్నది. అంటే నాకు చెప్పకుండా అమ్మేశావా నా బిడ్డల్ని నాకు దూరం చేశారా వేరే వాళ్ళు ఎక్కడున్నారు అంటూ పెద్దగా అరిచాడు. లేరు పట్నం పోయారు అన్నది. ఈ పాటికి ఆ ముసలి ఎద్దు లను ఏ ఏ కసాయి వాళ్లు కొనుక్కుని ఉంటారు. వాటిని చంపేస్తారు నాకు తెలుసు.
అవి ముసలి వైనా వాటి నమ్మ దలుచుకోలేదు. నా కళ్ళ ముందు ఉంటే చాలని అనుకున్నాను. ఇంత పని చేస్తారు అనుకోలేదు అంటూ బాధ పడ్డారు. ఆ రాత్రంతా ఎల్లమంద పాకలోనే కూర్చుని ఉన్నాడు. రాత్రి భోజనానికి పిలిచినా రాలేదు. తనే వస్తాడులే అనుకొన్నది రత్నం. అర్ధరాత్రి దాటింది ఎల్లమంద అలాగే కూర్చున్నాడు. నా బిడ్డలు నన్ను వదిలి వెళ్ళిపోయారు ఎద్దులు వెళ్ళిపోయాయి నేను ఎందుకు బ్రతకాలి. గుండెలవిసేలా ఏడ్చాడు. నిర్ధాక్షిణ్యంగా కొడుకులు చేసిన పని గుండెల్ని పిండేసింది. తెల్లవారింది భార్య పాకలోకి వచ్చి చూసింది. ఎల్లమంద గట్టుమీద అ కూర్చున్నవాడు కూర్చున్న టే ఉన్నాడు. ఏమయ్యా ఇప్పటికైనా ఇంట్లో కి వస్తావా అన్నది .ఉలుకు పలుకు లేదు. భుజం మీద చెయ్యి వేసింది. అంతే నేలకు ఒరిగిపోయాడు ఎల్లమంద. అమ్మో అంటూ పెద్దపెట్టున అరిచింది. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కొడుకులిద్దరూ నిద్ర పోతూనే ఉన్నారు. రేయ్ ఏయ్ తొందరగా రండి రా మీ నాన్న పడిపోయాడు అంటూ కేక పెట్టింది. పక్క మీద నుంచి లేచి కళ్ళు నలుపుకుంటూ వచ్చారు. తండ్రి కింద పడి పోయి ఉన్నాడు గుండె ఆగిపోయింది. ఎద్దుల తో పాటు ఎల్లమంద కూడా ఆ ఇంటిని విడిచి వెళ్లిపోయాడు.