గురుపూర్ణిమ విశిష్టత..:తాటి కోల పద్మావతి గుంటూరు.సెల్ నెంబర్.9441753376.

 భారతీయ సంస్కృతికి మూలం వేదాలు పురాణాలు. అటువంటి వేదాలను విభజించి పురాణాలను రచించి భారత భాగవతాలను రచించీ భారతీయ సంస్కృతిని రక్షించిన శ్రీమహావిష్ణు అంశ వేదవ్యాసులవారు. ఈయన యతి. ద్వాపరయుగంలో వేదములు పురాణాలు రక్షణ కొరకే ఉద్భవించారు ఈరోజు యతీశ్వరులు లకు చాలా ప్రాముఖ్యమైన నా రోజు. యతీశ్వరులు ఈ రోజున ప్రాత కాలంలో నిత్య కర్మానుష్టానాలు పూర్తి కావించి క్షురకర్మ చేయించుకొని తర్వాత వ్యాసుల వారిని అర్చిస్తారు. అందరూ కూడా ఉదయ కాలంలో నిత్య కర్మ అనుష్టానం పూర్తి కావించి గురు పరంపర సిద్ధార్థ యం వ్యాస పూజాం కరిష్యే. అని అని సంకల్పించి గురువులను యతీశ్వరులు లను అర్చించడం ఒక సంప్రదాయం. ఇది చాలా విశేషమైన ఆచారం.
గురువులంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తరతరాలకు కొనసాగవచ్చు. వేదవ్యాసులు మానవజాతి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లారు. కాబట్టి ఇ ఆయన్ని గురువుగా భావిస్తారు. వేదవ్యాసుని పూర్వ నామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతి నంతా నాలుగు వేదాలలో ఆయన సంకలనం చేశారు. అందుకే కే ఆ యన్ని వేదవ్యాసులు గా పిలుస్తారు. గతమంతా గురు బ్రహ్మ అ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. గురువు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు. ఆషాడమాసంలో పౌర్ణమి రోజున గురువు ను పూజించే రోజు. అందుకే ఓకే గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని అంటారు. ఈ రోజున వ్యాస జన్మదినం వైశంపాయన వేదాల్ని వివరించిన కృష్ణ ద్వైపాయనుడు నుంచి పూజించే రోజు. ఈ రోజును గురుపూజోత్సవం గా గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తన జీవితానికి మార్గనిర్దేశం ముక్తి వైపు నడిపినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు మాత్రం వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి దీనికంతా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ రోజున చాలామంది ప్రజలు ఈరోజు పొడవునా ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. ప్రతి విద్యార్థి గురువును గౌరవించాలి. గురువు చెప్పిన ప్రతి మాట వేదవాక్కు లాంటిది. ఆయన బాటలో నడిచే వారికి ఎల్లప్పుడు ఆశీర్వాదం లభిస్తూనే ఉంటుంది. గురువు లేనిదే విద్య రాదు. శ్రీరామచంద్రులు కూడా విశ్వామిత్రుని వద్ద విద్యనభ్యసించారు. పాండవులు కూడా ద్రోణాచార్యుని వద్ద విద్యనభ్యసించారు. ఎంత గొప్ప విద్యార్థికైనా గురువు లేనిదే విద్య గురు తెలుగు. అక్షరాభ్యాసం నుంచి చెయ్యి పట్టుకునే అక్షరాలు దించే తొలి గురువు. గురువంటే దైవంతో సమానం. అలాంటి గురువుని వ్యాసపూర్ణిమ రోజున పూజించుకుందాం స్మరించుకుందాం అందరం. శ్రీ గురుభ్యోనమః.
కామెంట్‌లు