జాతీయ విద్యా విధానం:---గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా
జాతీయ విద్యా విధానం
కావాలి అందరికీ ప్రధానం
అన్ని భాషల నేర్చుకుందాం
నిష్ణాతుల మై మనం ఉందాం !

వయస్సుకు మించిన సెలబస్ వద్దు
పిల్లలందరికీ కానేకాదు అది ముద్దు
ప్రభుత్వం ఈ విషయం గ్రహించాలి
పాఠ్యాంశముల,అలా కుదించాల!

త్రిభాషా సూత్రాన్ని అనుసరించి
విధివిధానాలను వారు నిర్వహించి
జాతీయ భాషకు చోటు కల్పించాలి
ప్రాంతీయబాష కు స్పందించాలి. !


దేశభక్తి అంశాలను అందులో చేర్చి
ధీయుక్త కథాంశములయందుకూర్చి
అందరి సెలెబెస్ ఒకటిగాను మార్చి
జాతీయ విద్యా విధానాన్ని సంస్కరించాలి !

దేశమంతా ఓకే విద్యావిధానం ఉండాలి
ఆదేశా సాహిత్యం సుసంపన్నమైన పండాలి
నవీన అంశాలతో అది తులతూగాలి
మన విద్యా విధానం అమృతభాండమై ఇలవెలగాలి !

కామెంట్‌లు