వసంతోత్సవం:--గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తినాగర్ కర్నూల్ జిల్లా.సెల్ నెంబర్.9491387977.
అదిగదిగో మన నవ వసంతోత్సవం
ఇదిగిదిగో ఘన యువ మదనోత్సవం
వస్తున్నది వస్తున్నది అంబరాన్ని దాటుకుంటూ
మస్తున్నది మస్తున్నది తంౠరను మీటుకుంటు

ఇది హోలీ హోలీ మన రాసకేలి
మది కాముని పండుగ ఢోళీ
కలిసిమెలిసి మీరు పాడాలి
అలసిసొలసి అంత ఆడాలి

ఈ హోలీ హోలీ హోలీ హోలీ
మన రంగుల పండుగ రంగోలి
మీరు చెంగావి చీరలు క ట్టండి
కోరి సిగలోన పూలను పెట్టండి!

మన వన్నెల కన్నెల వసంతం వచ్చింది
అన్నుల మిన్నుల అందాలనే ఇచ్చింది
ఆడుతూ పాడుతూ చిందే ధ్ధాంమనమండీ
చేరుతూ కోరుతూ విందిధ్ధాం ఇక నుండి


కామెంట్‌లు