మా నన్నయ్య వాణి పత్రిక:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్ ర్.9491387977.

ఆది కవి మా నన్నయ్య వాణి వార పత్రిక
మా మది మెచ్చిన వీణాపాణి పుత్రిక
వారం వారం మన ముందుకు వస్తుంది
పరివారంకు మస్తు ఆనందం కలిగిస్తుంది !

కవితలను కథలను అచ్చేస్తుంది
కవులకు అవకాశం తానిచ్చేస్తుంది
ముద్రారాక్షసాలకు చోటే ఇవ్వదు
ముద్రా గవాక్ష కులను మీటవ్వదు !

మంచి మంచి నీతి కథలను అందిస్తుంది
మంచి నెంచి తాను వెంటనే స్పందిస్తుంది
అచ్చేసి  చదువరులను అలరిస్తుంది ది
వారం వారం అందరినీ పలకరిస్తుంది !

ప్రోత్సాహాన్ని కోరి ఇస్తుంది కళాకారులకు
నిరుత్సాహాన్ని తరిమేస్తుంది దూర తీరాలకు
అందినంత లో అవకాశం అందరికీ కల్పిస్తుంది
ముదమంది సంతలో కొనేలా చేస్తుంది  !

చిట్టి చిట్టి చిత్ర కథల నందిస్తుంది
ముట్టి నట్టి మంచి రచనలకు సందిస్తుంది
సాహితీ ప్రభలతోను మురిపిస్తుంది
సాహిత్య సభలను తాను జరిపిస్తుంది !


కామెంట్‌లు