కిట్టయ్య పిల్లలం (బాల గీతం ):-గుర్రాల లక్ష్మారెడ్డి , కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
మేం రేపల్లె కిట్టయ్య పిల్లలం
మా పల్లె  కిష్టమైన మల్లెలం
ఆ కిట్టయ్య వెంటే మేముంటం
ఆయనే మా దేవుడని అంటం !

మా పాటకు ప్రాణం పోస్తుంటం
మేం ఆటకు ప్రస్తానం వేస్తుంటం
భజనలు మా బాగా చేస్తుంటం
భజగోవిందం అని ఆలపిస్తుంటం !

మేం రేపల్లె వాడలోని వారలం
మా పల్లెతల్లి గారాల పోరలం
ఆచల్లనితల్లి నీడలో నివశిస్తాం
అల్లిబిల్లి ఆటలతో పరవశిస్తాం

మా బృందావనంలో విహరిస్తాం
మా బృంద గానంతో అలరిస్తాం
మస్తు పర్యాటకులను ఆకర్శిస్తాం
వాస్తు పర్యావరణంను దర్శిస్తాం  !

కానాల మా బాగా పెంచేస్తాం
కాలుష్యాన్ని వేగా తుంచేస్తాం
పరిసరాల మేం శుభ్రం చేస్తాం
పరిశీలకుల గూడా మెప్పిస్తాం

బృందావనమును గని
బృందగానమును విని
అశేష జనమే వస్తారు
విశేష కానుకలే ఇస్తారు !

ఈ రేపెల్లే మేం పుట్టిన ఊరు
ఈ పల్లెకు చేయించాం తేరు
తిరుణాలప్పుడు తిప్పుతాం
శుభ ఫలితాలను చెపుతాం

ఆ మురళీకృష్ణుడు మా నేస్తం
తరలి వెళ్లి ఆయనను పూజిస్తం
ఆలకించి వరమును అందిస్తాడు
పులకించే పరవశంలో బంధిస్తాడు !


కామెంట్‌లు