పసిపిల్లల ఆవేదన:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.

కోలాటం వేసేటి పిల్లలం
పోరాటం చేసేటి మల్లెలం
కొత్త కొత్త పాటలు పాడుతం
చిత్తుబొత్తుఆటలు ఆడుతం !

ముద్దు గాను సద్ది బువ్వ తింటాం
బుద్ధిగాను మేం బడికి పోతుంటాం
నప్పే మా గురువును కనుగొంటాం
చెప్పే చదువును మేం  వింటాం  !

మా అమ్మ నాన్నల పూజిస్తాం
మేం పిల్లల పెద్దల ప్రేమిస్తాం
మా దేశం కోసం ప్రాణం ఇస్తాం
మేము మా ఆశ శ్వాసై జీవిస్తాం!

అదుపుతప్పిన స్కూల్ బస్సులు మాకున్న
సదుపాయములు మాత్రం గుండు సున్నా
అందులోన ఎక్కితే రక్షణ కరువు
ముందుగానే వినిపిస్తాయి వాటి దరువు !

మేమంతా వస్తూ పోతూ ఉంటే
మా కిడ్నాపింగులు జరుగుతూ ఉంటే
మేము ఎట్లా వెళ్ళేది మా బడికి
ఇక్కట్ల పాలు కాకుండా ఈ గుడికి !

అడ్డుకునే రాస్తారోకో మేం గమనిస్తూ
రోడ్డు షోలను మేము అధిగమిస్తూ
సరైన టైమ్ కు బడికి పోయేది ఎట్లా?
మెరుగైన చదువును మేము పొందేది ఎట్లా?