దాశరథి తరంగాలు:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9492387977.
మా దాశరథీ శ్రీ రంగాచార్యులు
సాహితీ చారిత్రక కవి వర్యులు
సాహితీ సంద్రాన్ని ఈదినవాడు
సాహితీ మిత్రుల్లో వెలిగిన రేడు !

నవతరం నవలలను  వ్రాసి
నూతనకథలవెతలనుమోసి
కవితలు అల్లి చెవులను గిల్లి
కానరాని ఏలోకంకెల్లడోమల్లి !

తాను అంగరంగ వైభవంగా
బంగారు కలలు ఎన్నో కంటు
భారత స్వాతంత్ర కవనం వింటు
భావి చరిత్ర రచన చేసిన బంటు !

తాను కన్న కలలన్నీ కల్లలు కాకుండా
నిజాలై నిలవాలని ఆశా పాశంతో తానుండ
మన దేశం దేదీప్యమానమైన వెలగాలని
ప్రపంచ దేశాలలో ప్రథమ స్థానమై నిలవాలని
రానున్నది ఏది నిజం నవలలో తాను వ్రాసాడు
అందరికన్న మిన్నయై దేశం భారం మోసాడు !

కవితలనూ మన ఆత్మ వెతలనూ
పొందుపరిచి రచనలెన్నో అందించే
అనువాదాలను కూడా వదలకుండ
మనకందించిన కవనంనిండుకుండ

మోదుగుపూలు చిల్లర దేవుళ్ళు
మన తెలుగువారి గుజ్జనగుళ్ళు
జానపదం రానున్నది ఏది నిజం
అన్నవారి నవలలు అజరామరం !

కుల మార్పిడి మతమార్పిడిల
వ్యవస్థను ఆడ బాప అవస్థల
అద్భుతంగా చిత్రీకరించినాడు
అమోఘంగా సూత్రీకరించినాడు !

నడి బొడ్డు గ్రామం ఘట్టం నుండి
గ్రామాభ్యుదయ పట్టంకై వారండి
అమృతం గమయ నవల యందు 
కష్టనష్టాలను

తెలిపె తాముందుండి

నీ జ్ఞాపకాల నీడల్లో మేం నిలుస్తాం
మా విజ్ఞాపనలతో నిత్యంకొలుస్థాం
మేం మీ రచనల సదా చదువుతాం
చదివిచదివి మేమెంతోఎదుగుతాం


.
కామెంట్‌లు