బాలల గేయాలు:యడ్ల శ్రీనివాసరావుచరవాణి:9493707592

 చుక్కలన్నీ గాలిపటం లా
చక్కగా చుట్టి పరిగెడతాయి
చిట్టి చిట్టి చిన్నారుల
చిరునవ్వుల ఆటల జల్లు నవ్వు
పెదవి విప్పితే పలికే నవ్వు
ఆడితే వచ్చేది ఎంతో ఆనందం
చంద్రుణ్ణి చూపించే పాపాయి చూడు
బాల గణపతి లాంటి బుజ్జాయిలు చూడు
తారాజువ్వలు ఎగరేసే
కేరింత పరవశాలు చూడు
చిట్టి చిట్టి బుజ్జాయి లా చోటా హనుమాన్ లను చూడు
ఆకాశాన్ని చుట్టి గలడు
పర్వతాలని కొట్టగలడు
ఆనందం అమిత ఆనందం
ఉల్లాసమైన చిట్టి పిల్లల పరవశం లను చూడు
తలుచుకుంటే మా పిల్లలు భారతదేశానికే కీర్తి 
తలుచుకుంటే వారే జాతీయ పతాకం ను హిమాలయ పర్వతాల మీద ఎగిరి వేయించ గలరు
చిట్టి బుజ్జి లను ఏడిపించకు
సీమ పటాకా లాంటి సిసింద్రీలు మన బుజ్జాయిలు