నీలికంఠుని వర్ణమా!:-పిల్లి.హజరత్తయ్యశింగరాయకొండప్రకాశం జిల్లా9848606573

శ్రీకృష్ణుని మేనిరంగు ఛాయవై
నీలి మేఘశ్యాముడిని
అలరించిన వర్ణ మా!

వరాల జల్లు నిచ్చే బోలా శంకరుడి
కంఠంలో ఒదిగిన సింగారమా!

సృష్టికే మూలమైన మగువ మనసును 
నీ ఓరచూపుతో కట్టిపడేసిన తారకమంత్రమా!

ఎటు చూసినా కంటికి ఇంపుగా కనబడుతూ 
భూమ్యాకాశాలను ఏకం చేసిన మనోహర రూపమా !

ఆకాశమంతా ఆవహించి గగనపు వీధిల్లో 
గంధపు పరిమళాలను వెదజల్లిన గమకమా!

భూమిపైన జలసిరిలో భాగమై 
మహాసముద్రాలలో దాగిన ముత్యమా!
మరకత మాణిక్యలలో భాసిల్లి
 నీలిమణులు రూపంలో మెరిసిన వజ్రమా!

రక్షించే రక్షకదళాల యూనిఫాంలో కొలువై
ప్రశాంతతను ప్రజ్జ్వలింపజేసిన మనోహర రూపమా!

జాతీయపతాకంలోని అశోకచక్రంలో 
అలరించి అభివృద్ధిని కాంక్షించిన ధర్మమా! 
భూగ్రహాన్ని మేలిముసుగుతో కప్పేసిన 
మలయమారుతమా!నీలవర్ణమా!!కామెంట్‌లు