శ్వాసకు ఊపిరి అమ్మ :--పిల్లి.హజరత్తయ్యశింగరాయకొండక్రమ సంఖ్య: 9848606573

 (క)మ్మనైన లాలి పాటలు ఎన్నో పాడి
(మ)మకారపు ముద్దను తినిపించి
(ల)క్షణమైన కథలను వినిపించి
(నా) జీవితాన్ని శోభయామానంగా తీర్చిదిద్ది
(భా)ధ్యతాయుతంగా నడుచుకునే తీరును నేర్పి
(క)న్నీటిని సైతం పన్నీరుగా మార్చేసి
(న)వ్వుల పువ్వులను నాకు అందిస్తూ
(గ)గనమంత ప్రేమను నాపై కురిపిస్తూ
(రా)త్రనక పగలనక నిరంతరం శ్రమించి
(వా)త్సల్య పరిమళాలను పూయించే తన్మయత్వం తను నా జన్మకు మూలము.నా శ్వాసకు ఊపిరి తను..!