సుద్దల బతుకమ్మ:-: పిల్లి.హజరత్తయ్యసింగరాయకొండ, ప్రకాశం జిల్లాచరవాణి : 9848606573

బతుకమ్మ ముత్తయిదువుల వేడుక

తొమ్మిది రోజులు మహిళలు
తొమ్మిది రూపాలలో బతుకమ్మను
తొమ్మిది  రకాల నైవేద్యాలతో పూజించు
తరువాత బతుకమ్మను నిమజ్జనం గావించు

మగవారు తంగేడు గునుగు పూలు తేగా
మహిళలు పూలతో బతుకమ్మను కూర్చగా
పళ్లెంలో పసుపు గౌరీ మాతను పూజించి
నిమజ్జనానికి బయలుదేరు సుద్దల బతుకమ్మ

మేళతాళాలు ఊరేగింపు తరలిరాగా
బతుకమ్మ పాటలతో హోరెత్తగా
మలీచను అందరికీ పంచగా
నిమజ్జనంగావించుబతుకమ్మను

మాంగల్యాని కాపాడు బతుకమ్మ 
చెరువులను బలోపేతం గావించు బోడేమా
నీటి సంరక్షణ గావించు అటుకుల బతుకమ్మ
పర్యావరణ పరిరక్షణగావించు ఎంగిలి పువ్వు బతుకమ్మ
నీటిని శుద్ధి గావించు బతుకమ్మ పూలు